హైదరాబాద్ చిత్తు
ABN , Publish Date - Jan 26 , 2026 | 05:47 AM
ముంబైతో గ్రూప్ ‘డి’ రంజీట్రోఫీ మ్యాచ్‌లో హైదరాబాద్ తొమ్మిది వికెట్లతో చిత్తయ్యింది. 10 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ముంబై కేవలం...
నాకౌట్‌కు ముంబై
హైదరాబాద్: ముంబైతో గ్రూప్ ‘డి’ రంజీట్రోఫీ మ్యాచ్‌లో హైదరాబాద్ తొమ్మిది వికెట్లతో చిత్తయ్యింది. 10 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ముంబై కేవలం ఒక వికెట్ కోల్పోయి 12 రన్స్ చేసి ఛేదించింది. అంతకుముందు 166/7 స్కోరుతో ఆదివారం, రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన హైదరాబాద్ 302 పరుగులకు ఆలౌటైంది. మిలింద్ (85) అర్ధ శతకంతో సత్తా చాటాడు. ముషీర్ ఖాన్ ఐదు, అవస్థి మూడు, ఓంకార్ రెండు వికెట్లు పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో పర్యాటక జట్టు 560 రన్స్ చేయగా, హైదరాబాద్ 267 పరుగులకు ఆలౌటై ఫాలోఆన్ ఆడింది. ఈ విజయంతో ముంబై జట్టు (30 పాయింట్లు) నాకౌట్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది.
ఇవి కూడా చదవండి:
ఐసీసీ చురకలు.. టీ20 ప్రపంచ కప్‌నకు జట్టును ప్రకటించిన పాకిస్తాన్
సంజూ ఇప్పటికే చాలా ఒత్తిడిలో ఉన్నాడు: టీమిండియా మాజీ క్రికెటర్