క్రీడా పాలకుడు రణ్‌ధీర్ ఇకలేరు
ABN , Publish Date - May 28 , 2026 | 02:12 AM
వెటరన్ క్రీడా పాలకుడు, ఆసియాడ్ షూటింగ్‌లో భారత్‌కు తొలి స్వర్ణాన్ని అందించిన రణ్‌ధీర్ సింగ్ (79) మరణించారు...
న్యూఢిల్లీ: వెటరన్ క్రీడా పాలకుడు, ఆసియాడ్ షూటింగ్‌లో భారత్‌కు తొలి స్వర్ణాన్ని అందించిన రణ్‌ధీర్ సింగ్ (79) మరణించారు. వయో సంబంధిత అనారోగ్య సమస్యలతో కొద్దిరోజులుగా చికిత్స తీసుకొంటున్న ఆయన ఢిల్లీలోని తన నివాసంలో బుధవారం కన్నుమూశారు. రణ్‌ధీర్‌కు భార్య, ముగ్గురు కుమార్తెలున్నారు. ఆటగాడిగానే కాకుండా క్రీడా పరిపాలకుడిగా కూడా ఆయన కీలకపాత్ర పోషించారు. 1987నుంచి 2010వరకు భారత ఒలింపిక్ సంఘం సెక్రటరీ జనరల్‌గా, 2021 నుంచి జనవరి 2026 వరకు ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా అధ్యక్షుడిగా సేవలందించారు. అనారోగ్య కారణాలతో ఇటీవల ఆ పదవికి రాజీనామా చేశారు. ఐదుసార్లు ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన రణ్‌ధీర్.. 1978 బ్యాంకాక్ ఆసియా క్రీడల్లో ట్రాప్ ఈవెంట్‌లో చారిత్రక స్వర్ణం గెలిచారు.
ఇవి కూడా చదవండి:
రాజస్థాన్‌తో మ్యాచ్.. ఎస్ఆర్‌హెచ్‌లో వారిద్దరిపై వేటు!
సినిమాను మించిన ట్విస్టులతో సాగిన స్టార్ క్రికెటర్ లవ్ స్టోరీ!