వరల్డ్ నెం.4కు రక్షిత ఝలక్
ABN , Publish Date - Nov 20 , 2026 | 05:09 AM
భారత టీనేజ్ షట్లర్ రక్షితా రామ్‌రాజ్ తన అంతర్జాతీయ కెరీర్‌లో అతిపెద్ద సంచలనం నమోదు చేసింది. హాంకాంగ్ ఓపెన్ సూపర్ 500...
క్వార్టర్‌ఫైనల్లో భారత షట్లర్
సాత్విక్ జోడీ, లక్ష్యసేన్, శ్రీకాంత్ కూడా..
కౌలూన్ (హాంకాంగ్): భారత టీనేజ్ షట్లర్ రక్షితా రామ్‌రాజ్ తన అంతర్జాతీయ కెరీర్‌లో అతిపెద్ద సంచలనం నమోదు చేసింది. హాంకాంగ్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో ఏకంగా టోక్యో ఒలింపిక్ చాంపియన్‌కు షాకిచ్చింది. ఇక..లక్ష్యసేన్, కిడాంబి శ్రీకాంత్, సాత్విక్ ద్వయం కూడా టోర్నీలో ముందంజ వేశారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌లో 19 ఏళ్ల రక్షిత వరుస గేముల్లో 21-18, 24-22తో వరల్డ్ నెం.4, టోక్యో ఒలింపిక్ చాంపియన్ చెన్ యూఫీ (చైనా)ని చిత్తు చేసి క్వార్టర్‌ఫైనల్లో అడుగుపెట్టింది. క్వార్టర్‌ఫైనల్లో థాయ్‌లాండ్‌కు చెందిన పోర్న్‌పవీ చొచువాంగ్‌తో రక్షిత ఆడనుంది. పురుషుల డబుల్స్ రెండో రౌండ్‌లో సాత్విక్/చిరాగ్ ద్వయం 21-19, 21-16తో నూర్ మహ్మద్/టాన్‌వీ రియాంగ్ (మలేసియా) జోడీని ఓడించింది. కాగా లక్ష్యసేన్ 21-11, 21-18తో రాస్ముస్ (డెన్మార్క్)పై, శ్రీకాంత్ 12-21, 21-18, 21-14తో యో టీ బిన్(కొరియా)పై విజయంతో క్వార్టర్‌ఫైనల్‌కు చేరారు. మహిళల డబుల్స్ ప్రీక్వార్టర్‌ఫైనల్లో గాయత్రి/ట్రీసా జోడీ 20-22, 13-21తో అమెరికా ద్వయం లారెన్/అలీసన్ చేతిలో పరాజయంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది.
ఇవి కూడా చదవండి:
భారత్‌తో టెస్టు మ్యాచ్: ముగిసిన తొలి రోజు ఆట.. కివీస్ స్కోర్ 243/5
టెన్నిస్ ఛాంపియన్‌షిప్ విజేతగా లారా దత్తా కుమార్తె..