సింధు అకాడమీకి భూమిపూజ
ABN , Publish Date - Aug 06 , 2026 | 04:05 AM
స్టార్ షట్లర్ పీవీ సింధు అకాడమీ నిర్మాణానికి తొలి అడుగు పడింది. విశాఖలోని ఆరిలోవలో బుధవారం పీవీ సింధు సెంటర్ ఆఫ్ స్పోర్ట్స్ అకాడమీ...
విశాఖపట్నం (ఆంధ్రజ్యోతి): స్టార్ షట్లర్ పీవీ సింధు అకాడమీ నిర్మాణానికి తొలి అడుగు పడింది. విశాఖలోని ఆరిలోవలో బుధవారం పీవీ సింధు సెంటర్ ఆఫ్ స్పోర్ట్స్ అకాడమీ నిర్మాణానికి ఆ రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేశ్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ.. అత్యున్నత ప్రమాణాలతో అంతర్జాతీయస్థాయి అకాడమీని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపింది. బ్యాడ్మింటన్ మాత్రమే కాకుండా స్విమ్మిం గ్, షూటింగ్, వెయిట్‌లిఫ్టింగ్, బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్‌తో పాటు అన్ని క్రీడాశిక్షణకు వేదికగా ఈ అకాడమీ నిలుస్తుందని సింధు వెల్లడించింది.
ఇవి కూడా చదవండి:
సీనియర్ ఆటగాళ్లను గౌరవించాలి.. గంభీర్‌కు పరోక్షంగా సందేశం ఇచ్చిన రహానే
ప్రీతి జింటాతో డేటింగ్ రూమర్స్.. ఎట్టకేలకు నోరు విప్పిన బ్రెట్ లీ