సింధు శుభారంభం
ABN , Publish Date - May 27 , 2026 | 02:54 AM
స్టార్ షట్లర్ పీవీ సింధు, డబుల్స్ ఏస్ జంట సాత్విక్ సాయిరాజ్/చిరాగ్ శెట్టి సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో...
సాత్విక్ జోడీ బోణీ
సింగపూర్ ఓపెన్
సింగపూర్: స్టార్ షట్లర్ పీవీ సింధు, డబుల్స్ ఏస్ జంట సాత్విక్ సాయిరాజ్/చిరాగ్ శెట్టి సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో శుభారంభం చేశారు. మంగళవారం మొదలైన ఈ పోటీల్లో వీరిద్దరు మినహా మిగతా భారత షట్లర్లంతా ఆరంభంలోనే ఇంటిబాట పట్టారు. తొలి రౌండ్లో సింధు 21-17, 21-18తో ఐదో సీడ్ పుత్రి కుసుమ వర్దని (ఇండోనేసియా)పై నెగ్గింది. డబుల్స్‌లో సాత్విక్ ద్వయం 26-28, 21-15, 21-1తో మలేసియా జోడీ చెన్ జి/ప్రెస్లీ స్మిత్‌ను ఓడించి రెండో రౌండ్ చేరింది. ఇక, సింగిల్స్‌లో ఆయుష్ శెట్టి, ఉన్నతి హుడా, డబుల్స్‌లో అర్జున్/హరిహరన్, మహిళల డబుల్స్‌లో సిమ్రన్/కవిప్రియ, శిఖా గౌతమ్/అశ్వినీ భట్, మిక్స్‌డ్‌లో రుత్వికా శివాని/రోహన్ కపూర్ ప్రత్యర్థుల చేతిలో ఓడి టోర్నీ నుంచి వెనుదిరిగారు.
ఇవి కూడా చదవండి..
కర్ణాటకలో అధికార మార్పిడి కాదు, రాజ్యసభ ఎన్నికలపైనే చర్చించా... కాంగ్రెస్ అధిష్టానం
చొరబాట్లతో అసహజ జనాభా మార్పుపై కేంద్రం ఉన్నతస్థాయి కమిటీ.. అమిత్‌షా