కష్టకాలంలో అండగా నిలిచాడు
ABN , Publish Date - Jul 22 , 2026 | 05:26 AM
రెండేళ్ల విరామం తర్వాత భారత స్టార్ షట్లర్ పీవీ సింధు స్థాయికి తగ్గ ఆటతీరుతో అలరిస్తూ జపాన్ ఓపెన్‌లో విజేతగా నిలిచింది. అయితే..
విరాట్‌పై సింధు
న్యూఢిల్లీ: రెండేళ్ల విరామం తర్వాత భారత స్టార్ షట్లర్ పీవీ సింధు స్థాయికి తగ్గ ఆటతీరుతో అలరిస్తూ జపాన్ ఓపెన్‌లో విజేతగా నిలిచింది. అయితే గతేడాది సెప్టెంబరులో గాయంతో మూడు నెలలు విశ్రాంతి తీసుకోవడం, కోలుకున్నాక కూడా ఓటములే ఎదురవడంతో సింధు నిరాశలో మునిగిపోయింది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ అండగా నిలిచినట్టు సింధు పేర్కొంది. ‘నేను విరాట్‌కు రుణపడి ఉంటా. నా కెరీర్ గాడి తప్పుతున్న సమయంలో కోహ్లీని సంప్రదించా. ఆ సందర్భంగా అతను ఇచ్చిన సలహాలు నాకెంతగానో ఉపయోగపడ్డాయి. నాకు అవసరమైనప్పుడు విరాట్ మద్దతు లభించడం నాకెంతో ఉత్సాహాన్నిచ్చింది. కొన్ని సంభాషణలు మన ఆలోచనా తీరును మార్చేస్తాయి’ అని ఓ ఇంటర్వ్యూ సందర్భంగా సింధు వెల్లడించింది.
ఇవి కూడా చదవండి:
వైభవ్ సూర్యవంశీ ప్రత్యేకమైన ప్లేయర్.. జాగ్రత్తగా తీర్చిదిద్దాలి: సికందర్ రజా
రోహిత్ శర్మ ఇప్పుడు కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు: రవి శాస్త్రి