మూడేళ్లలో మొదటిసారి..
ABN , Publish Date - Jul 18 , 2026 | 05:24 AM
టోక్యో: స్టార్ షట్లర్ పీవీ సింధు చాన్నాళ్ల తర్వాత ఓ సూపర్-750 ఈవెంట్‌లో సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది...
‘జపాన్’ సెమీస్‌కు సింధు
టోక్యో: స్టార్ షట్లర్ పీవీ సింధు చాన్నాళ్ల తర్వాత ఓ సూపర్-750 ఈవెంట్‌లో సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. జపాన్ ఓపెన్ క్వార్టర్‌ఫైనల్లో సింధుతో తలపడాల్సిన ప్రత్యర్థి, ప్రపంచ మాజీ చాంపియన్ నొజొమి ఒకుహర (జపాన్) గాయం కారణంగా మ్యాచ్ నుంచి వైదొలగింది. దీంతో సింధు సెమీస్ చేరింది. తద్వారా దాదాపు మూడేళ్లలో తొలిసారిగా సూపర్-750 టోర్నీలో సింధు సెమీస్‌లో ప్రవేశించినట్టయింది. 31 ఏళ్ల సింధు చివరిగా 2023 డెన్మార్క్ ఓపెన్‌లో సెమీస్ చేరింది.
ఇవి కూడా చదవండి:
రైల్వే ప్రయాణికులపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ భేటీ