సింధు తొమ్మిదో‘సారీ’
ABN , Publish Date - May 30 , 2026 | 01:52 AM
ప్రపంచ నెంబర్‌వన్ షట్లర్ అన్ సే యంగ్ (దక్షిణకొరియా) చేతిలో పీవీ సింధుకు మళ్లీ నిరాశే ఎదురైంది. యంగ్‌తో తలపడిన తొమ్మిదిసార్లూ సింధు ఓటమిపాలైంది...
‘సింగపూర్’లో సెమీ్‌సకు సాత్విక్ జోడీ
అన్ సే యంగ్ చేతిలో ఓటమి
లక్ష్యసేన్ కూడా అవుట్
సింగపూర్: ప్రపంచ నెంబర్‌వన్ షట్లర్ అన్ సే యంగ్ (దక్షిణకొరియా) చేతిలో పీవీ సింధుకు మళ్లీ నిరాశే ఎదురైంది. యంగ్‌తో తలపడిన తొమ్మిదిసార్లూ సింధు ఓటమిపాలైంది. సింగపూర్ ఓపెన్ క్వార్టర్స్‌లో అన్ సే యంగ్ 21-17, 21-14తో సింధును చిత్తుచేసింది. ఇక, క్వార్టర్స్‌లో లక్ష్యసేన్ 19-21, 21-15, 15-21తో కొకి వటనబె (జపాన్) చేతిలో ఓడాడు. కాగా పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయురాజ్/చిరాగ్ శెట్టి జోడీ 19-21, 21-17, 21-13తో కాంగ్/ఆరోన్ (మలేసియా)పై నెగ్గి సెమీస్‌కు దూసుకెళ్లింది. మిక్స్‌డ్ క్వార్టర్స్‌లో ప్రత్యర్థి వైదొలగడంతో ధ్రువ్ కపిల/తనీషా జోడీ సెమీ్‌సకు చేరుకుంది.
ఇవి కూడా చదవండి:
కేన్ విలియమన్స్ వరల్డ్ రికార్డ్
వైభవ్‌కు బౌలింగ్ చేయడం అంత ఈజీ కాదు: ప్యాట్ కమిన్స్