Share News

ముగిసిన భారత్‌ పోరు

ABN , Publish Date - Jul 24 , 2026 | 02:33 AM

చైనా ఓపెన్‌ సూపర్‌ 1000 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత పోరాటం ముగిసింది. మహిళలు, పురుషుల సింగిల్స్‌లో స్టార్‌ షట్లర్లు పీవీ సింధు, లక్ష్యసేన్‌, యువ ఆటగాడు...

ముగిసిన భారత్‌ పోరు

సింధు, లక్ష్య, ఆయుష్‌ అవుట్‌

చైనా ఓపెన్‌

చాంగ్‌ఝౌ (చైనా): చైనా ఓపెన్‌ సూపర్‌ 1000 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత పోరాటం ముగిసింది. మహిళలు, పురుషుల సింగిల్స్‌లో స్టార్‌ షట్లర్లు పీవీ సింధు, లక్ష్యసేన్‌, యువ ఆటగాడు ఆయుష్‌ షెట్టి ప్రీ క్వార్టర్‌ఫైనల్స్‌లో వెనుదిరిగారు. గతవారం జపాన్‌ ఓపెన్‌ గెలిచిన పీవీ సింధు ఆ జోరును ఇక్కడ కొనసాగించ లేకపోయింది. గురువారం హోరాహోరీగా జరిగిన సింగిల్స్‌ రెండో రౌండ్‌లో ఆమె 21-16, 20-22, 18-21తో ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ చెన్‌ యూఫీ (చైనా) చేతిలో పరాజయం చవిచూసింది. ఇక లక్ష్యసేన్‌ 19-21, 11-21తో విక్టర్‌ లాయ్‌ (కెనడా) చేతిలో వరుస గేముల్లో ఓడిపోయాడు. అలాగే తొలి రౌండ్‌లో వరల్డ్‌ నెం.11కు షాకిచ్చి సంచలనం సృష్టించిన ఆయుష్‌ షెట్టి..ప్రీక్వార్టర్స్‌లోనూ పోరాడాడు. కానీ 21-13, 13-21, 20-22తో ఐర్లాండ్‌కు చెందిన ఎన్‌గ్యుయెన్‌ చేతిలో ఓటమి తప్పలేదు.

ఇన్‌స్టా స్టోరీలో 'కాక్రోచ్' పోస్ట్.. వివాదంలో ఆర్ఏఎఫ్ ఆఫీసర్ సోనియా!

ప్రధాని నివాసం ముందు కాంగ్రెస్ నిరసన.. వాంగ్‌చుక్ భార్య విమర్శలు

Updated Date - Jul 24 , 2026 | 02:33 AM