క్వార్టర్స్‌లో సింధు, లక్ష్యసేన్
ABN , Publish Date - May 29 , 2026 | 01:17 AM
పీవీ సింధు, లక్ష్యసేన్ సింగపూర్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో క్వార్టర్‌ఫైనల్‌కు చేరారు. గురువారం జరిగిన ప్రీక్వార్టర్‌ఫైనల్లో...
సాత్విక్ జోడీ కూడా..
సింగపూర్ ఓపెన్
సింగపూర్: పీవీ సింధు, లక్ష్యసేన్ సింగపూర్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో క్వార్టర్‌ఫైనల్‌కు చేరారు. గురువారం జరిగిన ప్రీక్వార్టర్‌ఫైనల్లో సింధు 21-19, 21-12తో రికో గుంజి (జపాన్)పై విజయం సాధించింది. కాగా రెండో సీడ్ కున్లవత్ విదిత్‌సర్న్ వెన్ను గాయంతో అర్దంతరంగా వైదొలగడంతో లక్ష్యసేన్ క్వార్టర్స్‌కు చేరాడు. మరో మ్యాచ్‌లో ప్రణయ్ 18-21, 21-16, 15-21తో సింగపూర్‌కు చెందిన లో కీన్ యే చేతిలో పరాజయంతో టోర్నీ నుంచి వైదొలిగాడు. నాలుగో సీడ్ భారత జోడీ సాత్విక్/చిరాగ్ 21-15, 11-21, 21-18తో తైపీ జంట లీ/యాంగ్‌ను ఓడించి క్వార్టర్‌ఫైనల్లో అడుగుపెట్టింది.
ఇవి కూడా చదవండి:
కేన్ విలియమన్స్ వరల్డ్ రికార్డ్
వైభవ్‌కు బౌలింగ్ చేయడం అంత ఈజీ కాదు: ప్యాట్ కమిన్స్