Share News

ఫైనల్‌కు సింధు

ABN , Publish Date - Jul 19 , 2026 | 03:31 AM

భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు రికార్డు నెలకొల్పింది. రెండేళ్ల తర్వాత మునుపటి స్థాయిలో ఆడుతున్న ఈ తెలుగు తేజం జపాన్‌ ఓపెన్‌ సూపర్‌ 750 టోర్నీలో ఫైనల్‌కు...

ఫైనల్‌కు సింధు

టోక్యో: భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు రికార్డు నెలకొల్పింది. రెండేళ్ల తర్వాత మునుపటి స్థాయిలో ఆడుతున్న ఈ తెలుగు తేజం జపాన్‌ ఓపెన్‌ సూపర్‌ 750 టోర్నీలో ఫైనల్‌కు చేరింది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళా షట్లర్‌గా నిలిచింది. ఒలింపిక్‌ చాంపియన్‌ చెన్‌ యుఫీ జింక్స్‌ (చైనా)తో శనివారం జరిగిన సింగిల్స్‌ సెమీ్‌సలో సింధు 21-19, 15-10తో స్పష్టమైన ఆధిక్యంలో ఉన్న వేళ.. చెన్‌ గాయంతో రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగింది. దీంతో సింధు ఫైనల్‌ చేరింది. ఆదివారం జరిగే టైటిల్‌ పోరులో యమగూచి (జపాన్‌)తో సింధు తలపడనుంది.

ఇవి కూడా చదవండి:

ఇంగ్లండ్‌తో తుది వన్డేకు భారత్ సిద్ధం.. లార్డ్స్ గడ్డపై రికార్డు మారేనా?

'రక్తానికి రక్తం'.. ట్రంప్ కుటుంబమే లక్ష్యంగా ఇరాన్ భారీ బ్యానర్లు!

Updated Date - Jul 19 , 2026 | 03:31 AM