India Open Badminton: సింధు అవుట్
ABN , Publish Date - Jan 15 , 2026 | 05:55 AM
సొంతగడ్డపై టైటిల్‌తో సత్తా చాటుతుందనుకున్న రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో అనూహ్యంగా..
శ్రీకాంత్, ప్రణయ్ ముందంజ
న్యూఢిల్లీ: సొంతగడ్డపై టైటిల్‌తో సత్తా చాటుతుందనుకున్న రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో అనూహ్యంగా ఆరంభంలోనే వెనుదిరిగింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు 22-20, 12-21, 15-21తో వియత్నాం షట్లర్ తుయ్ లిన్ గుయెన్ చేతిలో ఓటమిపాలైంది. మరో భారత అమ్మాయి మాళవిక 21-18, 21-19తో పాయ్ యు పొపై నెగ్గగా, తన్వి 20-22, 21-18, 13-21తో వరల్డ్ నెం.2 వాంగ్ జి చేతిలో ఓటమిపాలైంది. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ 15-21, 21-6, 21-19తో సహచర షట్లర్ తరుణ్‌పై, ప్రణయ్ 22-20, 21-18తో లీ చుక్ యుపై గెలిచారు. డబుల్స్‌లో ప్రత్యర్థి జంట వాకోవర్ ఇవ్వడంతో స్టార్ జోడీ సాత్విక్/చిరాగ్ నేరుగా రెండోరౌండ్ చేరింది.
వైదొలగిన ఆంటోన్సెన్: ఢిల్లీలో విపరీత వాయు కాలుష్యం కారణంగా డెన్మార్క్‌కు చెందిన ప్రపంచ మూడో ర్యాంకర్ ఆండెర్స్ ఆంటోన్సెన్ ఇండియా ఓపెన్ నుంచి వైదొలిగాడు. డెన్మార్క్‌కే చెందిన మహిళా షట్లర్ మియా బ్లిచ్‌ఫీల్డ్ ఇప్పటికే టోర్నీ ఏర్పాట్లపై అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
ఇవీ చదవండి
ప్రయత్నం విఫలమైనా ప్రార్థనలు విఫలం కావు.. డీకే ఆసక్తికర పోస్ట్
జనవరి19న మళ్లీ సీబీఐ విచారణకు విజయ్..