ఆయుష్, సింధు అదేజోరు
ABN , Publish Date - Aug 20 , 2026 | 06:00 AM
ప్రపంచ చాంపియన్‌షి్‌పలో ఆరో పతకం అందుకోవాలని ఆరాటపడుతోన్న భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఆ దిశగా మరింత ముందంజ వేసింది. సింధుతో పాటు పురుషుల యువ సంచలనం ఆయుష్ శెట్టి సింగిల్స్‌లో...
ప్రీక్వార్టర్స్‌కు భారత స్టార్లు
ప్రపంచ బ్యాడ్మింటన్
సాత్విక్ జోడీకి వాకోవర్ జూలక్ష్యసేన్, ఉన్నతి అవుట్
న్యూఢిల్లీ: ప్రపంచ చాంపియన్‌షి్‌పలో ఆరో పతకం అందుకోవాలని ఆరాటపడుతోన్న భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఆ దిశగా మరింత ముందంజ వేసింది. సింధుతో పాటు పురుషుల యువ సంచలనం ఆయుష్ శెట్టి సింగిల్స్‌లో వరుసగా రెండో విజయంతో ప్రీక్వార్టర్స్‌కు దూసుకెళ్లారు. ఇక, 2021లో కాంస్యం నెగ్గిన సీనియర్ స్టార్ లక్ష్యసేన్, వర్ధమాన తార ఉన్నతి హుడా తమ పోరాటాన్ని రెండో రౌండ్‌కే పరిమితం చేస్తూ టోర్నీ నుంచి నిష్క్రమించారు. బుధవారం జరిగిన పోరులో మాజీ చాంపియన్, 9వ సీడ్ సింధు 21-16, 21-17తో కెనడా షట్లర్ వెన్ యు జాంగ్‌ను ఓడించింది. క్వార్టర్స్ బెర్త్ కోసం చైనాకు చెందిన మూడోసీడ్ వాంగ్ జి యితో సింధు అమీతుమీ తేల్చుకోనుంది. ఇక, తొలిసారి మెగా టోర్నీలో తలపడ్డ ఉన్నతి హుడా 21-11, 9-21, 21-23తో 12వ సీడ్ మిచెల్లె లీ (కెనడా) చేతిలో పోరాడి ఓడింది. పురుషుల సింగిల్స్‌లో ఆరంభ రౌండ్లో డిఫెండింగ్ చాంపియన్ షి యుకికి షాకిచ్చిన ఆయుష్ శెట్టి అదే జోరులో రెండో రౌండ్‌ను అలవోకగా అధిగమించాడు. ఆయుష్ 21-8, 21-10తో దుమిం దు అబెవిక్రమ (శ్రీలంక)పై గెలిచి అల్వి ఫర్హాన్ (ఇండోనేసియా)తో ప్రీక్వార్టర్స్ పోరుకు సిద్ధమయ్యాడు. మరోవైపు ఫేవరెట్ అనుకున్న లక్ష్యసేన్ 21-19, 19-21, 17-21తో అమెరికా టీనేజ్ షట్లర్ గారెత్ టాన్‌కు తలొగ్గి టోర్నీలో తన పోరును ముగించాడు. పురుషుల డబుల్స్‌లో భారత స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్/చిరాగ్ శెట్టి వరుసగా రెండో మ్యాచ్ బరిలోకి దిగకుండానే ప్రీక్వార్టర్స్ చేరింది. తొలి రౌండ్లో బై అందుకున్న సాత్విక్ ద్వయానికి రెండో రౌండ్లో ప్రత్యర్థి, స్కాట్లాండ్ జంట అలెగ్జాండర్ డన్/ఆడమ్ ప్రింగిల్ నుంచి వాకోవర్ లభించింది. పురుషుల డబుల్స్‌లోనే మరో జోడీ అర్జున్/హరిహరన్ రెండో రౌండ్లో ఓటమిపాలైంది. మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత జోడీ తనీషా క్రాస్టో/ధ్రువ్ కపిల 21-11, 21-11తో మకావుకు చెందిన లియోంగ్ /ఎంగ్ వెంగ్‌ను ఓడించి ప్రీక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి:
తండ్రైన ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ గ్లెన్ మాక్స్‌వెల్
కోహ్లీ సలహాలు నా జీవితాన్నే మార్చేశాయి: ఇంగ్లండ్ క్రికెటర్