Share News

ఆయుష్‌, లక్ష్య ముందంజ

ABN , Publish Date - Jul 23 , 2026 | 02:15 AM

రెండుసార్లు ఒలింపిక్‌ పతక విజేత పీవీ సింధు చైనా ఓపెన్‌ రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది. ఆయుష్‌ షెట్టి తొలి రౌండ్‌లో...

ఆయుష్‌, లక్ష్య ముందంజ

  • సింధు కూడా

  • చైనా ఓపెన్‌

చాంగ్‌ఝౌ (చైనా): రెండుసార్లు ఒలింపిక్‌ పతక విజేత పీవీ సింధు చైనా ఓపెన్‌ రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది. ఆయుష్‌ షెట్టి తొలి రౌండ్‌లో ప్రపంచ 11వ ర్యాంకర్‌కు షాకిచ్చి సంచలనం సృష్టించాడు. బుధవారం జరిగిన మొదటి రౌండ్‌లో సింధు 21-14, 9-21, 21-10తో ఉన్నతి హూడాపై గెలిచేందుకు మూడు గేమ్‌లపాటు పోరాడాల్సి వచ్చింది. ఇక ఆయుష్‌ 17-21, 21-5, 21-17తో అల్వీ ఫర్హాన్‌ను చిత్తు చేశాడు. మరో మ్యాచ్‌లో లక్ష్యసేన్‌ 22-20, 15-21, 21-14తో తనకా (జపాన్‌)ను ఓడించి రెండో రౌండ్‌కు చేరాడు. పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో హరిహరన్‌/అర్జున్‌ 16-21, 7-21తో కెంగ్‌/వాంగ్‌ చేతిలో ఓడారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో రుత్విక/రోహన్‌ 9-21, 16-21తో ఫెంగ్‌ యాన్‌/హువాంగ్‌ చేతిలో, ధ్రువ్‌ కపిల/తనీష 18-21, 18-21తో గో జిన్‌/ ఫాంగ్‌ చేతిలో ఓటమితో నిష్క్రమించారు.

Also Read:

కౌంటీ ఛాంపియన్‌షిప్: యార్క్‌షైర్‌తో కుల్‌దీప్ యాదవ్ ఒప్పందం

గిద్దలూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

Updated Date - Jul 23 , 2026 | 02:15 AM