Share News

Malaysia Open 2026: సింధు, సాత్విక్‌ జోడీ శుభారంభం

ABN , Publish Date - Jan 08 , 2026 | 05:56 AM

గాయంతో కొంతకాలంగా పోటీలకు దూ రంగా ఉన్న ఏస్‌ షట్లర్‌ పీవీ సింధు తాజా సీజన్‌ను విజయంతో ప్రారంభించింది....

Malaysia Open 2026: సింధు, సాత్విక్‌ జోడీ శుభారంభం

మలేసియా ఓపెన్‌

కౌలాలంపూర్‌ : గాయంతో కొంతకాలంగా పోటీలకు దూ రంగా ఉన్న ఏస్‌ షట్లర్‌ పీవీ సింధు తాజా సీజన్‌ను విజయంతో ప్రారంభించింది. సింధు తోపాటు స్టార్‌ డబుల్స్‌ జోడీ సాత్విక్‌/చిరాగ్‌ కూడా మలేసియా ఓపెన్‌లో శుభారంభం చేశారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో సింధు 21-14, 22-20తో తైపీకి చెందిన సుంగ్‌ షు యున్‌పై గెలుపొందింది. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌/చిరాగ్‌ 21-13, ద్వయం 21-15తో యాంగ్‌/లీ (తైపీ)జంటపై నెగ్గి రెండో రౌండ్‌లో అడుగుపెట్టారు. మహిళల డబుల్స్‌లో గాయత్రి/ట్రీసా జోడీ 9-21, 23-21, 19-21తో ఫెబ్రీనా/మెలీసా (ఇండోనేసి యా) ద్వయం చేతిలో పో రాడి ఓడి నిష్క్రమించింది. అలాగే రుతు పర్ణ/ శ్వేత పర్ణ జంట కూడా పరాజయం పాలైంది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ రుత్వికా శివానీ/రోహన్‌ కపూర్‌, ధ్రువ్‌ కపిల/తనీషా, అమృత/సూర్య జోడీలు కూడా మొదటి రౌండ్‌లో ఓడిపోయారు.

ఇవీ చదవండి:

కలిసి ఎనిమిది ఎన్నికల్లో పోటీ చేశాం.. డీఎంకేతో పొత్తుపై కాంగ్రెస్

కాంగ్రెస్, ఏఐఎంఐఎంతో బీజేపీ పొత్తు.. నిప్పులు చెరిగిన ఫడ్నవిస్

Updated Date - Jan 08 , 2026 | 05:56 AM