సింధు @ 500
ABN , Publish Date - Jan 23 , 2026 | 05:03 AM
జకార్త:స్టార్ షట్లర్ పీవీ సింధు సరికొత్త రికార్డు నెలకొల్పింది. మహిళల సింగిల్స్‌లో 500 విజయాలు నమోదు చేసిన తొలి భారత క్రీడాకారిణిగా నిలిచింది.
క్వార్టర్స్‌లో ప్రవేశం
లక్ష్య సేన్ కూడా..
జకార్త:స్టార్ షట్లర్ పీవీ సింధు సరికొత్త రికార్డు నెలకొల్పింది. మహిళల సింగిల్స్‌లో 500 విజయాలు నమోదు చేసిన తొలి భారత క్రీడాకారిణిగా నిలిచింది. గురువారం ఆమె ఇండోనేసియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ ప్రీక్వార్టర్స్‌లో 21-19, 21-18 తేడాతో లినే హోజ్‌మార్క్ (డెన్మార్క్)పై గెలిచి ఈ ఫీట్ నమోదు చేసింది. ఓవరాల్‌గా 732 సింగిల్స్ మ్యాచ్‌ల్లో సింధు 500 విజయాలు సా ధించింది.
గతంలో రచనోక్, తై జు యింగ్, యమగూచి, కరోలినా, నెడెల్చెవా ఈ జాబితాలో ఉన్నారు. క్వార్టర్స్‌లో టాప్ సీడ్, వరల్డ్ నెంబర్ 4 చెన్ యు ఫీ (చైనా)తో సింధు తలపడనుంది. పురుషుల క్వార్టర్స్‌లో లక్ష్యసేన్ 21-10, 21-11 తేడాతో హాంకాంగ్‌కు చెందిన జేసన్ గునవాన్‌పై గెలిచాడు. మరోవైపు శ్రీకాంత్ 11-21, 10-21 తేడాతో చౌ టియెన్ చెన్ (వియత్నాం) చేతిలో, అన్మోల్ ఖర్బ్ 21-16, 14-21, 11-21 తేడాతో ఒకుహర (జపాన్)పై ఓడారు.
ఈ వార్తలు కూడా చదవండి