Share News

సాత్విక్‌ జోడీకి 5 సింధుకు 9

ABN , Publish Date - Aug 05 , 2026 | 05:40 AM

సొంతగడ్డపై జరగనున్న ప్రతిష్టాత్మక ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సత్తా చాటేందుకు భారత షట్లర్లు సిద్ధమయ్యారు. ఈ మెగా టోర్నీ ఈనెల 17 నుంచి 23 వరకు దేశ రాజధానిలోని...

సాత్విక్‌ జోడీకి 5 సింధుకు 9

ప్రపంచ చాంపియన్‌షిప్‌ సీడింగ్స్‌ విడుదల

న్యూఢిల్లీ: సొంతగడ్డపై జరగనున్న ప్రతిష్టాత్మక ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సత్తా చాటేందుకు భారత షట్లర్లు సిద్ధమయ్యారు. ఈ మెగా టోర్నీ ఈనెల 17 నుంచి 23 వరకు దేశ రాజధానిలోని ఇందిరాగాంధీ స్టేడి యంలో జరగనుంది. ఈ సందర్భంగా టోర్నీలో పోటీపడుతున్న షట్లర్ల సీడింగ్‌లను మంగళవారం ప్రకటించారు. మాజీ చాంపియన్‌, రెండుసార్లు ఒలింపిక్‌ పతక విజేత పీవీ సింధుకు సింగిల్స్‌లో తొమ్మిదో సీడ్‌ దక్కింది. పురుషుల డబు ల్స్‌లో స్టార్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌/చిరాగ్‌ షెట్టికి ఐదో సీడింగ్‌ లభించింది. టోర్నీలో భాగంగా జరిగే ఐదు విభాగాల్లోనూ (పురుషుల, మహిళల సింగిల్స్‌, పురుషుల, మహిళల డబుల్స్‌, మిక్స్‌డ్‌) ఆతిథ్య భారత్‌ నుంచి ఇద్దరేసి షట్లర్లకు అవకాశం కల్పించారు. ఇక, పురుషుల సింగిల్స్‌లో వరల్డ్‌ చాంపియన్‌షి్‌ప కాంస్య పతక విజేత లక్ష్య సేన్‌ 14వ సీడ్‌గా, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో భారత ద్వయం ధ్రువ్‌ కపిల-తనీషా 15వ సీడ్‌గా పోటీపడను న్నారు. సింగిల్స్‌లో పురుషుల, మహిళల డిఫెండింగ్‌ చాంపియన్లు షి యుకి (చైనా), అన్‌ సె యంగ్‌ (కొరియా) టాప్‌సీడ్‌లుగా బరిలోకి దిగనున్నారు. బుధవారం మెయిన్‌ డ్రా వివరాలు వెల్లడికానున్నాయి.

ఇవి కూడా చదవండి:

శ్రీలంకలో అడుగుపెట్టిన టీమిండియా.. స్టార్ ప్లేయర్ గైర్హాజరు

రహానేకు దక్కాల్సిన గుర్తింపు ఎప్పుడూ దక్కలేదు: సునీల్ గావస్కర్

Updated Date - Aug 05 , 2026 | 05:40 AM