Andhra Under 15 Women Cricket: పుష్పిత గౌడ్ డబుల్ సెంచరీ
ABN , Publish Date - Jan 05 , 2026 | 05:54 AM
బీసీసీఐ అండర్-15 మహిళల వన్డే ట్రోఫీ ఎలీట్ గ్రూప్‌లో ఆంధ్ర 437 పరుగుల భారీ తేడాతో సౌరాష్ట్రను చిత్తు చేసింది. నాగ్‌పూర్‌లో...
ఆంధ్ర 437 పరుగుల రికార్డు విజయం
విశాఖపట్నం స్పోర్ట్స్ (ఆంధ్రజ్యోతి): బీసీసీఐ అండర్-15 మహిళల వన్డే ట్రోఫీ ఎలీట్ గ్రూప్‌లో ఆంధ్ర 437 పరుగుల భారీ తేడాతో సౌరాష్ట్రను చిత్తు చేసింది. నాగ్‌పూర్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆంధ్ర జట్టు నిర్ణీత 35 ఓవర్లలో 3 వికెట్లకు 472 పరుగులు చేసింది. ఓపెనర్లు పుష్పితగౌడ్ డబుల్ సెంచరీ (205; 99 బంతు ల్లో 31 బౌండరీలు, 6 సిక్సర్లు), దీక్ష సెంచరీ (128) చెలరేగి తొలి వికెట్‌కు 249 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. గ్రీష్మ 98 పరుగులు చేసింది. అనంతరం సౌరాష్ట్ర 19.2 ఓవర్లలో 35 రన్స్‌కే కుప్పకూలింది. దీనిలో 14 ఎక్స్‌ట్రాలున్నాయి. ఈ మ్యాచ్‌లో 472 పరు గులు చేసిన ఆంధ్ర 2023-24లో నాగాలాండ్‌పై ఢిల్లీ చేసిన 466 పరుగుల రికార్డును అధిగమించింది.
ఇవి కూడా చదవండి:
Pakistan T20 World Cup Squad: జట్టును ప్రకటించిన పాకిస్థాన్.. స్టార్ ప్లేయర్‌కు షాక్
T20 World Cup 2026: బంగ్లా మ్యాచ్‌లు శ్రీలంకకు తరలింపు!