ఉషకు ఎదురుదెబ్బ
ABN , Publish Date - Nov 10 , 2026 | 05:45 AM
రెండోసారి భారత ఒలింపిక్ సంఘం (ఐవోఏ) అధ్యక్షురాలు కావాలనుకొంటున్న పీటీ ఉషకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఐవోఏ జనరల్ బాడీలో...
ఎస్‌వోఎం ఎన్నికల్లో నిరాశ
గెలిచిన సైనా, అంజు, డోలా, రాణి
న్యూఢిల్లీ: రెండోసారి భారత ఒలింపిక్ సంఘం (ఐవోఏ) అధ్యక్షురాలు కావాలనుకొంటున్న పీటీ ఉషకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఐవోఏ జనరల్ బాడీలో అత్యంత ప్రతిభావంతులైన క్రీడాకారుల (ఎస్‌వోఎం) ప్రతినిధుల కోసం సోమవారం జరిగిన ఆన్‌లైన్ పోలింగ్‌లో ఆమె తగినన్ని ఓట్లు సంపాదించలేక పోయింది. మహిళల ప్యానెల్ కోసం పోటీ పడిన ఆరుగురిలో ఒలింపిక్ పతక విజేత సైనా నెహ్వాల్, మాజీ లాంగ్ జంపర్ అంజు బాబీ జార్జ్, మాజీ ఆర్చర్ డోలా బెనర్జీ, మాజీ హాకీ కెప్టెన్ రాణీ రాంపాల్ టాప్-4లో నిలిచి అర్హత సాధించారు. 40 ఓట్లతో ఐదో స్థానానికే పరిమితమైన ఉష, ఆరోస్థానంతో మాజీ బాస్కెట్‌బాల్ ప్లేయర్ అనితా పాల్ ఎలిమినేట్ అయ్యారు. కాగా, ప్రత్యర్థులు తప్పుకోవడంతో ఒలింపిక్ పతక విజేత గగన్ నారంగ్, మాజీ బాక్సర్ విజేందర్ సింగ్, మాజీ రెజ్లర్ యోగేశ్వర్ దత్‌తోపాటు మాజీ టీటీ ఆటగాడు కమలేష్ మెహతా పురుషుల ప్యానెల్‌కు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఇవి కూడా చదవండి:
దక్షిణాఫ్రికా పర్యటన.. భారత మహిళా జట్ల ప్రకటన
ఎంఐతో ట్రేడ్ డీల్.. పంజాబ్‌కు చిక్కులు తప్పవు: భారత మాజీ క్రికెటర్