హర్షిత్, వరుణ్ అవుట్
ABN , Publish Date - Jul 13 , 2026 | 04:55 AM
ఇంగ్లండ్ వన్డేలతో పాటు జింబాబ్వే పర్యటనకు ఎంపిక చేసిన భారత జట్టులో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. యువ పేసర్ హర్షిత్ రాణా తొడ కండరాల గాయం కారణంగా...
జట్టులోకి ప్రిన్స్, బిష్ణోయ్
ఇంగ్లండ్‌తో వన్డే, జింబాబ్వేతో టీ20 సిరీ్‌సలు
బర్మింగ్‌హామ్: ఇంగ్లండ్ వన్డేలతో పాటు జింబాబ్వే పర్యటనకు ఎంపిక చేసిన భారత జట్టులో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. యువ పేసర్ హర్షిత్ రాణా తొడ కండరాల గాయం కారణంగా మంగళవారం నుంచి ఇంగ్లండ్‌తో జరిగే వన్డేలకు దూరమయ్యాడు. అతని స్థానంలో ఢిల్లీ పేసర్ ప్రిన్స్ యాదవ్‌ను జట్టులోకి తీసుకున్నట్టు బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. ఇక.. తొడ కండరాల గాయంతో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి జింబాబ్వే టీ20 సిరీస్ నుంచి తప్పుకొన్నాడు. ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్ ఈనెలాఖరులో మొదలవనుంది. దీంతో వరుణ్ స్థానంలో లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌ను ఎంపిక చేసినట్టు బోర్డు తెలిపింది. కాగా, ఇటీవల ఇంగ్లండ్‌తో టీ20ల్లో బిష్ణోయ్ అంతగా ఆకట్టుకోనప్పటికీ, అతడిని జట్టులోకి తీసుకోవడం గమనార్హం.
ఇవి కూడా చదవండి:
నాతో మర్యాదగా మాట్లాడండి.. రిఫరీతో మెస్సి వాగ్వాదం!
భారత్ వరుస ఓటములు.. కోచింగ్ స్టాఫ్‌లో కీలక మార్పులు!