ప్రవల్లిక బృందానికి పసిడి
ABN , Publish Date - Jul 13 , 2026 | 05:13 AM
తెలుగమ్మాయి ప్రవల్లిక నరిమల్ల అంతర్జాతీయ వేదికపై అదరగొట్టింది. ఆసియా అండర్-23 అథ్లెటిక్స్ చాంపియన్‌షి్‌పలో సహచర అథ్లెట్లతో కలిసి మహిళల 4గీ400 మీటర్ల రిలేలో భారత్‌కు స్వర్ణ పతకం అందించింది. ఆదివారం ఇక్కడ జరిగిన ఫైనల్స్‌లో...
ఓర్డోస్ (చైనా): తెలుగమ్మాయి ప్రవల్లిక నరిమల్ల అంతర్జాతీయ వేదికపై అదరగొట్టింది. ఆసియా అండర్-23 అథ్లెటిక్స్ చాంపియన్‌షి్‌పలో సహచర అథ్లెట్లతో కలిసి మహిళల 4గీ400 మీటర్ల రిలేలో భారత్‌కు స్వర్ణ పతకం అందించింది. ఆదివారం ఇక్కడ జరిగిన ఫైనల్స్‌లో ప్రవల్లిక, శ్రావణి సచిన్ సాంగ్లే, సాబు, నఫీసా ఖాతూన్‌లతో కూడిన భారత మహిళల జట్టు 3:33.62 సెకన్లలో గమ్యాన్ని చేరి విజేతగా నిలిచింది. చైనా రజతం, కజకిస్థాన్ బృందం కాంస్యం నెగ్గాయి. ఇక, మహిళల 4గీ100 మీటర్ల రిలేలో సంజన, అక్షయ, సుదీక్ష, శ్రీయా రాజేశ్‌లతో కూడిన భారత జట్టు (44.68 సె) రజతం సాధించింది. చైనాకు స్వర్ణం, కజకిస్థాన్‌కు కాంస్యం దక్కాయి. కాగా, పురుషుల 4గీ100 మీటర్ల రిలేలో భారత జట్టు రజతం నెగ్గింది. ఇక, జావెలిన్ త్రోలో ఆనంద్ సింగ్ పసిడి పతకం దక్కించుకోగా, శివమ్ కాంస్యం అందుకున్నాడు. ఓవరాల్‌గా ఈ టోర్నీలో భారత అథ్లెట్లు 3 స్వర్ణాలు, 4 రజతాలు, 9 కాంస్యాలతో కలిపి 16 పతకాలు కొల్లగొట్టారు.
ఇవి కూడా చదవండి:
నాతో మర్యాదగా మాట్లాడండి.. రిఫరీతో మెస్సి వాగ్వాదం!
భారత్ వరుస ఓటములు.. కోచింగ్ స్టాఫ్‌లో కీలక మార్పులు!