సీఎం విజయ్‌కు ప్రజ్ఞానంద ‘చెక్’
ABN , Publish Date - Jun 09 , 2026 | 03:09 AM
నార్వే చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన తమిళనాడు గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానందను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ అభినందించారు. ప్రజ్ఞానంద తన...
చెన్నై (ఆంధ్రజ్యోతి): నార్వే చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన తమిళనాడు గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానందను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ అభినందించారు. ప్రజ్ఞానంద తన తల్లిదండ్రులతో కలిసి సోమవారం సెక్రటేరియట్‌లో సీఎం విజయ్‌ను మర్యాదపూర్వకంగా కలిశాడు. ఈ సందర్భంగా ప్రజ్ఞానందతో సీఎం సరదాగా చెస్ ఆడారు. ఈ గేమ్‌లో విజయ్‌కు ప్రజ్ఞానంద చెక్ పెట్టి గెలిచాడు. అనంతరం ప్రజ్ఞానందను సన్మానించిన సీఎం.. ప్రభుత్వం తరఫున నజరానాగా రూ. 50 లక్షల చెక్‌ను అందజేశారు. సచివాలయానికి రావాలంటూ ఆహ్వానించడంతో వెళ్లానన్న ప్రజ్ఞానంద.. సీఎంతో కలిసి చదరంగం ఆడడం సంతోషంగా ఉందని మీడియాతో అన్నాడు. అంతేకాదు.. ఆయన చదరంగ నైపుణ్యాన్ని చూసి ఆశ్చర్యపోయానన్నాడు.
ఇవి కూడా చదవండి:
అరంగేట్రంలోనే మానవ్ సుతార్ అరుదైన ఘనత
అఫ్గాన్ బ్యాటర్ వింత ఔట్.. అసలేమిటీ ఆబ్సెంట్ హర్ట్?