పూజ జంప్ సరిపోలేదు...
ABN , Publish Date - Aug 11 , 2026 | 02:13 AM
తనపై పెట్టుకున్న అంచనాలను హైజంపర్ పూజా సింగ్ అందుకోలేకపోయింది. అండర్-20 ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షి్‌పలో ఫైనల్‌కు...
అండర్-20 ప్రపంచ అథ్లెటిక్స్
హైజంప్‌లో ఏడో స్థానంతో సరి
4 X 400 మీ. రిలే జట్టూ విఫలం
యూజీన్ (అమెరికా): తనపై పెట్టుకున్న అంచనాలను హైజంపర్ పూజా సింగ్ అందుకోలేకపోయింది. అండర్-20 ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షి్‌పలో ఫైనల్‌కు చేరి పతక ఆశలు పెంచిన ఆమె ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. ఇక..సోమవారం ముగిసిన ఈ టోర్నమెంట్‌లో భారత్ మూడు పతకాలకే పరిమితమైంది. మహిళల హైజంప్ ఫైనల్లో 20 ఏళ్ల పూజ 1.84 మీటర్లే లంఘించింది. ఇది ఆమె జాతీయ రికార్డు 1.93 మీ. కంటే చాలా తక్కువ కావడం గమనార్హం. మహిళల 4గీ400మీ. రిలే ఫైనల్లో భారత జట్టు 3ని.45.28 సె.లలో గమ్యం చేరి తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఇక..రెండు రజత, ఒక కాంస్య పతకంతో చాంపియన్‌షి్‌పను భారత్ ముగించింది. తద్వారా 2021, 2022 టోర్నమెంట్‌లలో సాధించిన పతకాల సంఖ్యను సమం చేసింది.
ఇవి కూడా చదవండి:
ఫిట్‌నెస్ కోసం 17 కిలోలు తగ్గాడు.. సర్ఫరాజ్ ఖాన్ ఈసారైనా నిరూపించుకుంటాడా?
2027 వన్డే ప్రపంచకప్.. జట్టులో చేరేందుకు సిద్ధంగా ఉన్నా: భువనేశ్వర్ కుమార్