పూజ ‘రికార్డు’ జంప్
ABN , Publish Date - May 30 , 2026 | 02:11 AM
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ చాంపియన్‌షి్‌పలో భారత టీనేజ్ సంచలనం పూజా సింగ్ హైజం్‌పలో 14 ఏళ్ల జాతీయ రికార్డును బద్దలుకొట్టింది. హరియాణాకు చెందిన...
హాంకాంగ్: ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ చాంపియన్‌షి్‌పలో భారత టీనేజ్ సంచలనం పూజా సింగ్ హైజం్‌పలో 14 ఏళ్ల జాతీయ రికార్డును బద్దలుకొట్టింది. హరియాణాకు చెందిన 19 ఏళ్ల పూజ 1.93 మీటర్లు లంఘించి సీనియర్ స్థాయిలో రికార్డును నెలకొల్పింది. ఈ క్రమంలో 2012లో సహనా కుమారి నమోదుచేసిన 1.92 మీట ర్ల రికార్డును అధిగమించింది. ఇదే టోర్నీలో 5వేల మీటర్ల రేస్ వాక్‌లో నితిన్, డిస్కస్ త్రోలో అమానత్, డెకాథ్లాన్‌లో రాహుల్ పసిడి, ఉప్‌కార్ రజతం, ట్రిపుల్ జంప్‌లో సాధనా దేవి రజతం, 400 మీటర్ల రేసులో నీరూ పాఠక్ కాంస్యం నెగ్గారు.
ఇవి కూడా చదవండి:
కేన్ విలియమన్స్ వరల్డ్ రికార్డ్
వైభవ్‌కు బౌలింగ్ చేయడం అంత ఈజీ కాదు: ప్యాట్ కమిన్స్