Share News

Prime Minister Narendra Modi: ఒలింపిక్స్‌ నిర్వహణకు సంసిద్ధం

ABN , Publish Date - Jan 05 , 2026 | 06:14 AM

ఒలింపిక్స్‌ నిర్వహణకు దేశం పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నొక్కి చెప్పారు. మెగా టోర్నమెంట్లకు ఆతిథ్యమివ్వడం ద్వారా...

Prime Minister Narendra Modi: ఒలింపిక్స్‌ నిర్వహణకు సంసిద్ధం

జాతీయ వాలీబాల్‌ పోటీల ప్రారంభంలో ప్రధాని మోదీ

వారణాసి: ఒలింపిక్స్‌ నిర్వహణకు దేశం పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నొక్కి చెప్పారు. మెగా టోర్నమెంట్లకు ఆతిథ్యమివ్వడం ద్వారా పెద్ద సంఖ్యలో క్రీడాకారులు ఎక్కువగా పోటీలలో తలపడే అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. వారణాసిలో 72వ జాతీయ సీనియర్‌ వాలీబాల్‌ చాంపియన్‌షి్‌పను వీడియో మాధ్యమం ద్వారా ప్రధాని ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘2030 కామన్వెల్త్‌ క్రీడలు భారత్‌లో జరగబోతున్నాయి. అలాగే 2036లో ఒలింపిక్స్‌ను నిర్వహించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాం’ అని అన్నారు. ‘గత 10 సంవత్సరాల్లో మనం 20 ప్రధాన అంతర్జాతీయ పోటీలకు ఆతిథ్యం ఇవ్వడం క్రీడారంగంలో దేశానికి పెరుగుతున్న ప్రాబల్యాన్ని సూచిస్తుంది’ అని మోదీ చెప్పారు.

వాలీబాల్‌కు దేశ అభివృద్ధికి సారూప్యం: వాలీబాల్‌ కేవలం క్రీడ కాదని మోదీ అన్నారు. ఆ ఆటకు దేశ అభివృద్ధికి సారూప్యం ఉందని చెప్పారు. ‘పట్టుదలకు, సామర్థ్యానికి వాలీబాల్‌ ఆట ప్రతీకగా నిలుస్తుంది. పరస్పర సహకారం, సమర్థత, జట్టు సన్నద్ధతపైనే విజయం ఆధారపడి ఉంటుందని ఈ ఆట తెలియజేస్తుంది. అలాగే దేశం కూడా అందరి సహకారంతోనే అభివృద్ధి దిశగా పయనిస్తుంది’ అని మోదీ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

Pakistan T20 World Cup Squad: జట్టును ప్రకటించిన పాకిస్థాన్.. స్టార్ ప్లేయర్‌కు షాక్

T20 World Cup 2026: బంగ్లా మ్యాచ్‌లు శ్రీలంకకు తరలింపు!

Updated Date - Jan 05 , 2026 | 06:14 AM