మరోసారి పాక్ పరువు పోయింది.. శ్రీలంక హోటల్‌లో మహిళా సిబ్బందితో పాక్ క్రికెటర్ అసభ్య ప్రవర్తన..
ABN , Publish Date - Mar 05 , 2026 | 03:06 PM
ప్రస్తుత టీ-20 ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శనతో విమర్శల పాలైన పాకిస్థాన్ క్రికెట్ జట్టు తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది. అంతర్జాతీయ స్థాయిలో పరువు పోగొట్టుకుంది. పాకిస్థాన్ క్రికెటర్ ఒకరు కొలంబోలోని హోటల్‌కు చెందిన మహిళా సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించినట్టు వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుత టీ-20 ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శనతో విమర్శల పాలైన పాకిస్థాన్ క్రికెట్ జట్టు తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది. అంతర్జాతీయ స్థాయిలో పరువు పోగొట్టుకుంది. పాకిస్థాన్ క్రికెటర్ ఒకరు కొలంబోలోని హోటల్‌కు చెందిన మహిళా సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించినట్టు వార్తలు వస్తున్నాయి. టీ-20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ తన అన్ని మ్యాచ్‌లను శ్రీలంకలోనే ఆడిన సంగతి తెలిసిందే. శ్రీలంకతో సూపర్-8 మ్యాచ్‌కు ముందు క్యాండీలోని హోటల్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళతో ఓ పాక్ క్రికెటర్ అనుచితంగా ప్రవర్తించాడట (Pakistan cricket controversy).
పాకిస్థాన్ అంతర్జాతీయ జట్టుకు చెందిన ఓ క్రికెటర్ క్యాండీలోని హోటల్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళతో అనుచితంగా ప్రవర్తించాడట. దాంతో ఆమె సహాయం గట్టిగా కేకలు వేసిందట. అప్పుడు మిగతా హోటల్ సిబ్బంది వచ్చి ఆమెను రక్షించినట్టు సమాచారం. ఆ తర్వాత హోటల్ సిబ్బంది అందరూ కలిసి ఆ క్రికెటర్‌పై యాజమాన్యానికి ఫిర్యాదు చేశారట. ఆ హోటల్ యాజమాన్యం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని పాక్ టీమ్ మేనేజర్ నవీద్ చీమాకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది (Pakistan cricketer misconduct).
ఆటగాళ్ల తరఫున నవీద్ చీమా ఆ మహిళకు, హోటల్ సిబ్బందికి క్షమాపణలు చెప్పినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి (Pakistan player penalty). మహిళా సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించిన ఆ క్రికెటర్‌కు భారీ జరిమానా విధించారట. అలాగే అతడు పీసీబీ క్రమశిక్షణ కమిటీ ముందు కూడా హాజరుకాబోతున్నాడట. ఈ నేపథ్యంలో అతడికి మరిన్ని శిక్షలు విధించే అవకాశం కనబడుతోంది. అయితే ఆ మహిళను వేధించిన క్రికెటర్ ఎవరనే విషయం మాత్రం బయటకు రాలేదు.
ఈ వార్తలు కూడా చదవండి..
పశ్చిమాసియా ఉద్రిక్తతల మధ్య అమెరికా భారీ క్షిపణి పరీక్ష
కువైట్ సమీపంలో ఆయిల్ ట్యాంకర్‌లో భారీ పేలుడు.. చమురు లీక్‌పై ఆందోళన