Share News

భారత్‌తో మ్యాచ్‌ బాయ్‌కాట్‌ ?

ABN , Publish Date - Jan 27 , 2026 | 06:10 AM

బంగ్లాదేశ్‌కు మద్దతు పేరిట పాకిస్థాన్‌ వక్రబుద్ధిని ప్రదర్శిస్తోంది. టీ20 వరల్డ్‌ కప్‌ ప్రతిష్ఠను దెబ్బ తీయాలని కుటిల పన్నాగాలు పన్నుతోంది. ప్రపంచ కప్‌లో పాల్గొనాలా..వద్దా...

భారత్‌తో మ్యాచ్‌ బాయ్‌కాట్‌ ?

  • యోచిస్తున్న పాక్‌ క్రికెట్‌ బోర్డు

  • తుది నిర్ణయం నాలుగు రోజుల్లో..

లాహోర్‌: బంగ్లాదేశ్‌కు మద్దతు పేరిట పాకిస్థాన్‌ వక్రబుద్ధిని ప్రదర్శిస్తోంది. టీ20 వరల్డ్‌ కప్‌ ప్రతిష్ఠను దెబ్బ తీయాలని కుటిల పన్నాగాలు పన్నుతోంది. ప్రపంచ కప్‌లో పాల్గొనాలా..వద్దా..అనేది తమ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ నిర్ణయిస్తారని పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) చైర్మన్‌ మొహిసిన్‌ నక్వీ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో ప్రధానిని..నక్వీ సోమవారం కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..టోర్నమెంట్‌ తాము ఆడే విషయమై చర్చలు జరుగుతున్నాయన్నారు. తుది నిర్ణయాన్ని వచ్చే శుక్రవారం లేదా సోమవారం వెల్లడిస్తామని తెలిపారు. అయితే టోర్నీ మొత్తాన్ని కాకుండా..వరల్డ్‌ కప్‌ బ్లాక్‌బస్టర్‌ భారత్‌తో పోరును బహిష్కరించాలని పీసీబీ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక..బంగ్లాదేశ్‌కు పూర్తి సహకారం అందించాలని నక్వీకి షెహబాజ్‌ సూచించినట్టు సమాచారం.

ఇవి కూడా చదవండి:

మా వాళ్లతో జాగ్రత్త.. పాక్‌కు టీమిండియా మాజీ క్రికెటర్ వార్నింగ్

అరుదైన చెత్త రికార్డుతో కోహ్లీ సరసన చేరిన సంజూ

Updated Date - Jan 27 , 2026 | 06:10 AM