Share News

T20 World Cup: బంగ్లాదేశ్‌కు పాక్‌ క్రికెట్‌ వత్తాసు

ABN , Publish Date - Jan 19 , 2026 | 02:56 AM

టీ20 వరల్డ్‌క్‌పనకు ముందు బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (బీసీబీ) వ్యవహారం మరింత ముదురుతోంది. తాజాగా బీసీబీకి పాక్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) మద్దతుగా నిలిచింది...

T20 World Cup: బంగ్లాదేశ్‌కు పాక్‌ క్రికెట్‌ వత్తాసు

కరాచీ: టీ20 వరల్డ్‌క్‌పనకు ముందు బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (బీసీబీ) వ్యవహారం మరింత ముదురుతోంది. తాజాగా బీసీబీకి పాక్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) మద్దతుగా నిలిచింది. భద్రతా కారణాలరీత్యా భారత్‌ నుంచి తమ వేదికలను శ్రీలంకకు మార్చాలన్న బంగ్లా డిమాండ్‌ను వెంటనే పరిష్కరించాలని పీసీబీ సూచించింది. లేకుంటే ఈ మెగా టోర్నీలో పాల్గొనే విషయమై ఆలోచించాల్సి వస్తుందని ఐసీసీని హెచ్చరించింది. అయితే వరల్డ్‌కప్‌లో పాల్గొనే విషయమై ఈనెల 21లోగా తేల్చుకోవాలని ఐసీసీ.. బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డును కోరినట్టు సమాచారం.

ఇవి కూడా చదవండి..

మిచెల్‌ను మైదానం నుంచి బయటకు నెట్టిన కోహ్లీ.. ఫన్నీ వీడియో వైరల్

అథర్వ తైడే సెంచరీ.. సౌరాష్ట్ర లక్ష్యం 318

Updated Date - Jan 19 , 2026 | 02:56 AM