పోతూ పోతూ... కెప్టెన్‌పై వేటు
ABN , Publish Date - Feb 20 , 2026 | 03:49 AM
పాకిస్థాన్ హాకీలో అంతర్గత సంక్షోభం మరింత ముదిరింది. ఇటీవలి ఆస్ట్రేలియా పర్యటనలో ప్లేయర్లకు కనీస సౌకర్యాలు కూడా కల్పించడంలో విఫలమైన టీమ్ మేనేజ్‌మెంట్‌ను జట్టు కెప్టెన్...
పోతూ పోతూ... కెప్టెన్‌పై వేటు
పాక్ హాకీ చీఫ్ నిర్వాకం
ముదిరిన రగడ
కరాచీ: పాకిస్థాన్ హాకీలో అంతర్గత సంక్షోభం మరింత ముదిరింది. ఇటీవలి ఆస్ట్రేలియా పర్యటనలో ప్లేయర్లకు కనీస సౌకర్యాలు కూడా కల్పించడంలో విఫలమైన టీమ్ మేనేజ్‌మెంట్‌ను జట్టు కెప్టెన్ అహ్మద్ షకీల్ భట్ బహిరంగంగానే విమర్శించాడు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ హాకీ సమాఖ్య (పీహెచ్‌ఎ్‌ఫ) అధ్యక్షుడు తారిక్ బగ్టీ తన పదవికి రాజీనామా చేశాడు. అయితే, పోతూపోతూ క్రమశిక్షణ చర్యల కింద షకీల్‌పై నిషేధం విధించాడు. పాక్ హాకీకి తలవంపులు తెచ్చే విధంగా వ్యవహరించినందుకే షకీల్‌పై రెండేళ్లపాటు దేశీయ, అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడకుండా నిషేధం విధించినట్టు తెలిపాడు. ప్రొ హాకీ లీగ్‌లో భాగంగా ఆస్ట్రేలియాలో పాక్ టీమ్ పర్యటించింది. ఆసీ్‌సతోపాటు జర్మనీతో ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ పాక్ ఓడింది. స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత.. ఆస్ట్రేలియాలో తాము ఎదుర్కొన్న ఘోర పరిస్థితులను కెప్టెన్ షకీల్ మీడియాకు చెప్పాడు. ఉండటానికి కనీస వసతులు కూడా పీహెచ్‌ఎ్‌ఫ కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇందుకు కారణమైన టీమ్ మేనేజ్‌మెంట్, పీహెచ్‌ఎ్‌ఫ ఆఫీసు బేరర్లను తొలగించాలని డిమాండ్ చేశాడు. మరోవైపు ఆటగాళ్లలో క్రమశిక్షణ లేదని, సహచరులను కించపరిచేలా షకీల్ నోరుపారేసుకొంటాడని హెడ్ కోచ్ తాహిర్ జమాన్ ఆరోపించాడు. జట్టు బాధ్యతల నుంచి వైదొలగడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపాడు.
ఇవి కూడా చదవండి..
బిల్‌గేట్స్ AI సమ్మిట్ ప్రసంగం: ఉత్కంఠకు తెర.. స్పష్టతనిచ్చిన ఫౌండేషన్!
సర్వజన క్షేమానికి పరిష్కారాలు కనుగొందాం