ఇదిగో మా జట్టు..
ABN , Publish Date - Jan 26 , 2026 | 05:52 AM
బంగ్లాదేశ్‌ను తప్పించినందుకు నిరసనగా..తామూ వరల్డ్ కప్‌నుంచి వైదొలగుతామని బీరాలు పలుకుతూనే మెగా టోర్నీలో పాల్గొనే జట్టును...
లాహోర్: బంగ్లాదేశ్‌ను తప్పించినందుకు నిరసనగా..తామూ వరల్డ్ కప్‌నుంచి వైదొలగుతామని బీరాలు పలుకుతూనే మెగా టోర్నీలో పాల్గొనే జట్టును పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ప్రకటించింది. ఆదివారం ఎంపిక చేసిన 15 మందితో కూడిన జట్టుకు సల్మాన్ ఆఘా కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. బంగ్లాదేశ్‌కు మద్దతుగా తామూ ప్రపంచ కప్‌నుంచి వైదొలుగుతామని, ఈ విషయమై ప్రధాని షహబాజ్ షరీఫ్ నిర్ణయం తీసుకుంటారని పీసీబీ చీఫ్ మొహిసిన్ నక్వీ శనివారం చెప్పాడు. అయితే ఐసీసీ ఆంక్షల హెచ్చరికలతో 24 గంటల్లో పాక్‌జట్టును సెలెక్టర్లు ప్రకటించడం గమనార్హం.
100 శాతం ఆడతామని కాదు..: జట్టును ప్రకటించినంత మాత్రాన తాము నూరుశాతం టోర్నీ బరిలో దిగుతున్నట్టు కాదని సెలక్షన్ కమిటీ సభ్యుడు ఆకిబ్ జావెద్ వెల్లడించాడు. ‘సెలెక్టర్లుగా జట్టును ఎంపిక చేయడం మా విధి. గడువు తేదీ (జనవరి 30) దగ్గర పడడంతో జట్టును ప్రకటించాం. మేము టోర్నీలో ఆడేదీ లేనిదీ ప్రభుత్వ నిర్ణయిస్తుంది’ అని ఆకిబ్ చెప్పాడు.
అయినా...ఆడతామో లేదో
బీరాలుపోతున్న పాక్ సెలెక్టర్లు
పాకిస్థాన్ జట్టు
సల్మాన్ ఆఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజమ్, ఫహీమ్ అష్రాఫ్, ఫఖర్ జమాన్, నయాఫ్ (కీపర్), మహ్మద్ నవాజ్, సల్మాన్ మీర్జా, నసీమ్ షా, షాహిబ్‌జాదా ఫర్హాన్ (కీపర్), సాయిమ్ అయూబ్, షహీన్ షా అఫ్రీది, షాదాబ్ ఖాన్, ఉస్మాన్ ఖాన్ (కీపర్), ఉస్మాన్ తారిఖ్.
ఇవి కూడా చదవండి:
ఐసీసీ చురకలు.. టీ20 ప్రపంచ కప్‌నకు జట్టును ప్రకటించిన పాకిస్తాన్
సంజూ ఇప్పటికే చాలా ఒత్తిడిలో ఉన్నాడు: టీమిండియా మాజీ క్రికెటర్