జీవితాంతం ఆడలేం అందుకే.. చదువు ముఖ్యం
ABN , Publish Date - Mar 19 , 2026 | 05:14 AM
వర్ధమాన అథ్లెట్లకు మంచి చదువు కూడా ముఖ్యమని స్టార్ షట్లర్ పీవీ సింధు సూచించింది. ఆటలమీదే దృష్టి నిలిపి చదువును నిర్లక్ష్యం చేయడం రిస్క్‌తో కూడిన పని...
యువ అథ్లెట్లకు సింధు సూచన
గుర్గావ్: వర్ధమాన అథ్లెట్లకు మంచి చదువు కూడా ముఖ్యమని స్టార్ షట్లర్ పీవీ సింధు సూచించింది. ఆటలమీదే దృష్టి నిలిపి చదువును నిర్లక్ష్యం చేయడం రిస్క్‌తో కూడిన పని అని హెచ్చరించింది. క్రీడలే కెరీర్ అనుకొంటే..ఒక్క గాయం ఆ కెరీర్‌కు ముగింపు పలుకుతుందని పేర్కొంది. ఇక్కడి ఓ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ సింధు ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. 2016 ఒలింపిక్స్‌కు ముందు పాదం గాయంతో తాను ఎదుర్కొన్న కుంగుబాటు ఉదంతం సహా తన క్రీడా జీవితంలోని పలు అంశాలను ఆమె ప్రస్తావించింది. ‘నేను ఎన్నో సంవత్సరాలుగా బ్యాడ్మింటన్ ఆడుతున్నా. ఏదో ఒక సమయంలో రిటైర్ కావాల్సిందే. 45, 50 లేదా 60 ఏళ్ల వయస్సు దాకా ఆడలేం కదా’ అని చెప్పింది. ‘అందువల్ల జీవితాంతం మీతో ఉండేది చదువే అన్న విషయాన్ని గుర్తించాలి’ అని సింధు సూచించింది. ‘అందరూ గోల్డెన్ స్పూన్‌తో పుట్టరు. చదువులైనా, ఆటలైనా అంతా కష్టపడాల్సిందే. క్రీడలకు, చదువుకు సమ ప్రాధాన్యం ఇవ్వాలి. అందుకే నేను ఎంబీఏ చదివా’ అని సింధు వివరించింది. కాగా.. అథ్లెట్లు చదువుకూ ప్రాధాన్యం ఇవ్వాల్సిన అంశాన్ని చీఫ్ కోచ్ గోపీచంద్ గతంలో చెప్పిన విషయాన్ని సింధు అభిప్రాయం బలపరుస్తోంది.
ఇవి కూడా చదవండి..
జియో కీలక ప్రకటన.. రోమింగ్ ప్యాక్ లేకున్నా ఓటీపీలు
సూచీలకు వరుసగా మూడో రోజూ లాభాలే.. రూపాయి భారీ పతనం..