Share News

ఒలింపిక్‌ విజన్‌పై విస్తృత చర్చ

ABN , Publish Date - May 01 , 2026 | 02:20 AM

దేశంలోని వివిధ క్రీడా విధానాలు, సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధనలు, ఆవిష్కరణలపై స్పోర్ట్స్‌ సమ్మిట్‌లో...

ఒలింపిక్‌ విజన్‌పై విస్తృత చర్చ

క్రీడా ప్రముఖుల హాజరు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): దేశంలోని వివిధ క్రీడా విధానాలు, సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధనలు, ఆవిష్కరణలపై స్పోర్ట్స్‌ సమ్మిట్‌లో విస్తృత చర్చ జరిగింది. గురువారం గచ్చిబౌలి స్టేడియంలో యంగ్‌ ఇండియా వ్యాయామ ఉపాధ్యాయ-స్పోర్ట్స్‌ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన స్పోర్ట్స్‌ సమ్మిట్‌లో ఒలింపిక్‌ విజన్‌, రాష్ట్ర స్పోర్ట్స్‌ పాలసీ, స్పోర్ట్స్‌ సైన్స్‌, లీగ్స్‌ నిర్వహణపైనా చర్చించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రీడాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్‌ రంజన్‌, ప్రభుత్వ క్రీడాశాఖ సలహాదారులు జితేందర్‌ రెడ్డి, శాట్‌ చైర్మన్‌ శివసేనా రెడ్డి, వీసీ-ఎండీ సోనీ బాలదేవి, స్పోర్ట్స్‌ వర్సిటీ వీసీ కిషోర్‌ గోపీనాథన్‌, పుల్లెల గోపీచంద్‌, శోభ, ఇస్మాయిల్‌ బేగ్‌, నాగపురి రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి:

ముంబై జట్టుకు మద్దతుగా వాంఖడే స్టేడియానికి వినోద్ కాంబ్లీ

రియాన్ పరాగ్‌పై బీసీసీఐ సీరియస్‌! జైలా..ఫైనా?

Updated Date - May 01 , 2026 | 02:20 AM