Share News

వావ్‌.. జొకోవిచ్‌

ABN , Publish Date - Jul 09 , 2026 | 02:42 AM

తాను ఎందుకు దిగ్గజమో నొవాక్‌ జొకోవిచ్‌ మరోసారి నిరూపించాడు. 39 ఏళ్ల వయస్సులోనూ సెర్బియా యోధుడు ఐదు గంటలకుపైగా పోరాడాడు. ఐదు సెట్లు.. అందునా సూపర్‌...

వావ్‌.. జొకోవిచ్‌

5 గంటలా 15 నిమిషాల

పోరులో ఫెలిక్స్‌పై గెలుపు

  • వింబుల్డన్‌ సెమీస్‌లో ప్రవేశం

  • జ్వెరెవ్‌, లిండా, కోస్ట్యుక్‌ కూడా

లండన్‌: తాను ఎందుకు దిగ్గజమో నొవాక్‌ జొకోవిచ్‌ మరోసారి నిరూపించాడు. 39 ఏళ్ల వయస్సులోనూ సెర్బియా యోధుడు ఐదు గంటలకుపైగా పోరాడాడు. ఐదు సెట్లు.. అందునా సూపర్‌ టైబ్రేకర్‌లో ఏమాత్రం తగ్గలేదు. తనకంటే 14 ఏళ్లు చిన్నోడైన ప్రత్యర్థిని మట్టికరిపించాడు. మంగళవారం అర్ధరాత్రి జరిగిన వింబుల్డన్‌ పురుషుల క్వార్టర్‌ఫైనల్లో ఏడోసీడ్‌ జొకోవిచ్‌ 7-6 (10), 3-6, 6-3, 6-7 (7), 7-6 (4)తో మూడో సీడ్‌, 24 ఏళ్లఫెలిక్స్‌ అగర్‌ అలియాసిమె (కెనడా)ను చిత్తు చేశాడు. ఐదు గంటలా 15 నిమిషాల పాటు సాగిన ఈ మారథాన్‌ పోరు.. ఆల్‌ ఇంగ్లండ్‌ క్లబ్‌లో అత్యంత సుదీర్ఘమైన క్వార్టర్‌ఫైనల్‌గా రికార్డు కెక్కింది. దీంతో 2008లో రైనర్‌ ష్యూట్లెర్‌-అర్నాడ్‌ క్లెమెంట్‌ల మధ్య జరిగిన క్వార్టర్‌ఫైనల్‌ (5 గంటలా 12 నిమిషాలు) రికార్డు బద్దలైంది. జొకోవిచ్‌కిది వరుసగా ఎనిమిదో వింబుల్డన్‌ సెమీఫైనల్‌. శుక్రవారం జరిగే సెమీ స్‌లో డిఫెండింగ్‌ చాంప్‌, వరల్డ్‌ నెం బర్‌వన్‌ సినర్‌తో జొకో తలపడతాడు. ఇక, రెండో సీడ్‌ జ్వెరెవ్‌ (జర్మనీ) 6-4, 6-2, 6-2తో ఆరో సీడ్‌ టేలర్‌ ఫ్రిట్జ్‌ (అమెరికా)పై, అన్‌సీడెడ్‌ అర్ధుర్‌ ఫెర్రీ (బ్రిటన్‌) 6-4, 7-6 (4), 6-0తో 9వ సీడ్‌ ఫ్లావియో కొబోలీ (ఇటలీ)పై గెలిచి సెమీస్‌లో అమీతుమీకి సిద్ధమయ్యారు. మహిళల సింగిల్స్‌లో 9వ సీడ్‌ లిండా నోస్కోవా (చెక్‌ రిపబ్లిక్‌) 6-3, 7-5తో 25వ సీడ్‌ మెర్టిన్స్‌ (బెల్జియం)పై, 12వ సీడ్‌ మార్టా కోస్ట్యుక్‌ (ఉక్రెయిన్‌) 6-3, 6-2తో 13వ సీడ్‌ పౌలిని (ఇటలీ)పై నెగ్గి సెమీఫైనల్లో ప్రవేశించారు.

ఇవి కూడా చదవండి:

ఐసీసీ ఎన్నికల్లో పెను సంచలనం.. డిప్యూటీ ఛైర్మన్ ఇమ్రాన్ ఖ్వాజాకు షాక్!

అక్తర్ రికార్డును బ్రేక్ చేస్తాను.. టీమిండియా బౌలర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Updated Date - Jul 09 , 2026 | 02:42 AM