Share News

భారత పర్యటనకు జొకో!

ABN , Publish Date - Apr 22 , 2026 | 02:59 AM

టెన్నిస్‌ గ్రేట్‌ నొవాక్‌ జొకోవిచ్‌ త్వరలో భారత పర్యటనకు వచ్చే అవకాశాలున్నాయి. ఈ టూర్‌లో విరాట్‌ కోహ్లీతో జొకో...

భారత పర్యటనకు జొకో!

విరాట్‌తో మ్యాచ్‌?

న్యూఢిల్లీ: టెన్నిస్‌ గ్రేట్‌ నొవాక్‌ జొకోవిచ్‌ త్వరలో భారత పర్యటనకు వచ్చే అవకాశాలున్నాయి. ఈ టూర్‌లో విరాట్‌ కోహ్లీతో జొకో టెన్నిస్‌తోపాటు క్రికెట్‌ ఆడే చాన్సుంది. కోహ్లీ తనకు మంచి స్నేహితుడని.. అతడి కారణంగానే తాను క్రికెట్‌వైపు ఆకర్షితుడయ్యానని జొకో తెలిపాడు. రెండేళ్ల నుంచి భారత్‌లో పర్యటించాలనుకొంటున్నా.. అది ఈ ఏడాది నిజమవ్వొచ్చని అన్నాడు. మాడ్రిడ్‌లో లారెస్‌ స్పోర్ట్స్‌ అవార్డుల వేడుకకు హాజరైన నొవాక్‌.. భారత మీడియా ప్రతినిధికిచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా పై విషయాలను వెల్లడించాడు.

ఇవి కూడా చదవండి:

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టీమిండియా మహిళల స్థానాలివే!

కండరాల గాయం.. ఐపీఎల్ నుంచి ఆయుశ్ మాత్రే ఔట్

Updated Date - Apr 22 , 2026 | 02:59 AM