నితేశ్ ‘పట్టే’శాడు రజతం
ABN , Publish Date - Apr 09 , 2026 | 03:49 AM
ఆసియా చాంపియన్‌షిప్‌లో భారత గ్రీకో-రోమన్ రెజ్లర్లు మరో మూడు పతకాలు కొల్లగొట్టారు. నితేశ్ సివాచ్ రజత పతకం సొంతం...
భారత్‌కు మరో 3 పతకాలు
బిష్కెక్ (కిర్గిస్థాన్): ఆసియా చాంపియన్‌షిప్‌లో భారత గ్రీకో-రోమన్ రెజ్లర్లు మరో మూడు పతకాలు కొల్లగొట్టారు. నితేశ్ సివాచ్ రజత పతకం సొంతం చేసుకోగా, ప్రిన్స్, సచిన్ సహ్రావత్ కాంస్యాలు దక్కించుకున్నారు. బుధవారం జరిగిన 97 కిలోల స్వర్ణ పతక పోరులో నితేశ్ 1-7తో సరావీ (ఇరాన్) చేతిలో ఓడి రజతంతో సంతృప్తి చెందాడు. 82 కిలోల విభాగంలో ప్రిన్స్ 10-1తో దిదార్ (తర్కమెనిస్థాన్)పై, 67 కిలోల పోరులో సచిన్ 9-4తో అబ్దుమాలిక్(ఉజ్బెకిస్థాన్)పై నెగ్గి కాంస్యాలు సాధించారు. మొత్తంగా ఈ టోర్నీ గ్రీకో రోమన్ విభాగంలో భారత రెజ్లర్లు మొత్తం 5 పతకాలు సొంతం చేసుకున్నారు.
ఇవి కూడా చదవండి:
ఎంఐపై హాఫ్ సెంచరీ మిస్.. వెక్కి వెక్కి ఏడ్చిన వైభవ్ సూర్యవంశీ
ఎంఐ-ఆర్ఆర్: మా ఓటమికి బౌలర్లే ప్రధాన కారణం.. హార్దిక్ పాండ్య