భళా.. బసవా!
ABN , Publish Date - May 26 , 2026 | 02:34 AM
భారత సంతతికి చెందిన అమెరికా వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఆటగాడు నిశేష్ బసవా రెడ్డి ఫ్రెంచ్ ఓపెన్‌లో పెను సంచలనం సృష్టించాడు. ఈ తెలుగు కుర్రాడు ఏకంగా ఏడో సీడ్ టేలర్ ఫ్రిట్జ్‌కు...
నేటి నుంచి సింగపూర్ ఓపెన్
బరిలో సింధు, లక్ష్యసేన్, ప్రణయ్
తొలి రౌండ్లో ఏడోసీడ్‌కు షాక్
తెలుగు కుర్రాడి సంచలనం
రిబకినా, జొకోవిచ్ ముందంజ
పారిస్: భారత సంతతికి చెందిన అమెరికా వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఆటగాడు నిశేష్ బసవా రెడ్డి ఫ్రెంచ్ ఓపెన్‌లో పెను సంచలనం సృష్టించాడు. ఈ తెలుగు కుర్రాడు ఏకంగా ఏడో సీడ్ టేలర్ ఫ్రిట్జ్‌కు ఝలక్ ఇచ్చాడు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో నిశేష్ 7-6(5), 7-6(5), 6-7(9), 6-1తో అమెరికాకే చెందిన ఫ్రిట్జ్‌పై పోరాడి గెలిచాడు. తొలిసారి మట్టికోర్టులో ఆడుతున్న 21 ఏళ్ల నిశేష్.. రెండు గంటలా 45 నిమిషాలపాటు సాగిన పోరులో డ్రాప్ షాట్లు, బేస్ లైన్ షాట్లతో దూకుడుగా ఆడాడు. రెండో రౌండ్‌లో అమెరికాకే చెందిన అలెక్స్ మిచెల్సన్‌తో బసవా రెడ్డి తలపడతాడు. మూడో సీడ్ నొవాక్ జొకోవిచ్ 5-7, 7-5, 6-1, 6-4తో గ్లోవని పెర్నీకార్డ్‌పై, 8వ సీడ్ అలెక్స్ డి మినార్ 6-4, 6-4, 6-2తో టోబీ శామ్యూల్‌పై నెగ్గారు. 12వ సీడ్ జిరి లెహెకా (చెక్) 3-6, 6-7(3), 3-6తో ఫాబియో కర్రీనో (స్పెయిన్) చేతిలో పరాజయం పాలయ్యాడు. ఇక, తన కెరీర్‌లో ఇదే చివరి టోర్నీ అని ప్రకటించిన మాజీ విజేత స్టానిస్లాస్ వావ్రింకా (స్విట్జర్లాండ్) 3-6, 6-3, 3-6, 4-6తో జెన్సన్ బ్రూక్స్ (అమెరికా) చేతిలో ఓడాడు. మహిళల్లో రెండో సీడ్ రిబకినా 6-2, 6-2తో మర్సింకోను, మాజీ చాంపియన్ స్వియటెక్ 6-1, 6-2తో ఎమర్సన్ జోన్స్‌ను, స్విటోలినా 6-3, 1-6, 7-6(3)తో అన్నా బోండార్‌ను, 13వ సీడ్ పౌలిని 7-5, 6-3తో డయానాను ఓడించి రెండో రౌండ్ చేరారు.
నెల్లూరు నుంచి..
నెల్లూరుకు చెందిన మురళీకృష్ణ బసవా రెడ్డి, సాయి ప్రసన్నల రెండో కుమారుడు నిశేష్ (21). ఉద్యోగ నిమిత్తం మురళీకృష్ణ దంపతులు 1999లో అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. టెన్నిస్ ఆట పట్ల అతడి ఇష్టాన్ని గమనించి తండ్రి.. నిశే్‌షకు ప్రత్యేక శిక్షణ ఇప్పించాడు. 2022లో సహచరుడు ఒజాన్ బారి్‌సతో కలసి యూఎస్ ఓపెన్ డబుల్స్ టైటిల్ నెగ్గడంతో వెలుగులోకి వచ్చాడు. 2024లో ఫ్రొఫెషనల్ కెరీర్‌లోకి అడుగుపెట్టిన నిశేష్.. ఏటీపీ టోర్నీల్లో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకొన్నాడు. ఈ క్రమంలో 2025 ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో వైల్డ్‌కార్డ్ ఎంట్రీ సాధించాడు. తొలి రౌండ్‌లో దిగ్గజం నొవాక్ జొకోవిచ్‌పై మొదటి సెట్ నెగ్గి అందరినీ ఆశ్చర్యపరిచాడు. వింబుల్డన్, యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో కూడా ఆడే అవకాశాన్ని దక్కించుకున్నాడు. తాజాగా ఫ్రెంచ్ ఓపెన్‌లో అద్భుత విజయం నమోదు చేశాడు.
ఇవీ చదవండి:
ఫిఫా ప్రపంచ కప్‌నకు ముందు గాయపడ్డ మెస్సి!
ఐపీఎల్ 2026: పాపం పంజాబ్.. కలగానే మిగిలిన ‘తొలి కప్పు’!