National Boxing Championship: క్వార్టర్స్‌లో నిఖత్
ABN , Publish Date - Jan 08 , 2026 | 05:58 AM
జాతీయ బాక్సింగ్ చాంపియన్‌షి్‌పలో తెలుగమ్మాయి నిఖత్ జరీన్ క్వార్టర్ ఫైనల్స్‌లోకి ప్రవేశించింది. బుధవారం గ్రేటర్ నోయిడాలోని...
న్యూఢిల్లీ: జాతీయ బాక్సింగ్ చాంపియన్‌షి్‌పలో తెలుగమ్మాయి నిఖత్ జరీన్ క్వార్టర్ ఫైనల్స్‌లోకి ప్రవేశించింది. బుధవారం గ్రేటర్ నోయిడాలోని గౌతమ బుద్ధ విశ్వవిద్యాలయంలో జరిగిన 48-51 కిలోల విభాగం ప్రీక్వార్టర్స్‌లో లద్దాఖ్‌కు చెందిన కుల్సోమ బానోపై నిఖత్ ఏకపక్ష విజయం సాధించింది. తొలి రౌండ్‌లోనే నిఖత్ పంచ్‌ల దాటికి ప్రత్యర్థి బానో తట్టుకోలేకపోవడంతో రెఫరీ బౌట్‌ను నిలిపివేసి విజేతగా ప్రకటించాడు. ఇతర విభాగాల్లో 50-55 కిలోల కేటగిరీలో పవన్, 70-75 కిలోల విభాగంలో సుమిత్ కూడా క్వార్టర్స్‌లో అడుగుపెట్టారు. వరల్డ్ చాంపియన్ మీనాక్షి (45-48 కిలోలు), కామన్వెల్త్ మెడలిస్ట్ అమిత్ పంఘల్ (52 కిలోలు) కూడా ముందంజ వేశారు.
ఇవీ చదవండి:
కలిసి ఎనిమిది ఎన్నికల్లో పోటీ చేశాం.. డీఎంకేతో పొత్తుపై కాంగ్రెస్
కాంగ్రెస్, ఏఐఎంఐఎంతో బీజేపీ పొత్తు.. నిప్పులు చెరిగిన ఫడ్నవిస్