నిఖత్‌కు షాక్
ABN , Publish Date - May 15 , 2026 | 02:15 AM
రెండుసార్లు వరల్డ్ చాంపియన్ నిఖత్ జరీన్‌కు షాక్ తగిలింది. కామన్వెల్త్, ఆసియా క్రీడల ట్రయల్స్ నుంచి ఆమె అవుటైంది. బుధవారం జరిగిన మహిళల 51 కిలోల సెమీ్‌సలో నిఖత్...
ట్రయల్స్‌లో ఓటమి
కామన్వెల్త్, ఆసియాడ్ ఆశలు ఆవిరి
పటియాలా: రెండుసార్లు వరల్డ్ చాంపియన్ నిఖత్ జరీన్‌కు షాక్ తగిలింది. కామన్వెల్త్, ఆసియా క్రీడల ట్రయల్స్ నుంచి ఆమె అవుటైంది. బుధవారం జరిగిన మహిళల 51 కిలోల సెమీ్‌సలో నిఖత్ 1-4తో సాక్షి చౌదరి చేతిలో ఓడింది. దీంతో కామన్వెల్త్, ఆసియాడ్‌లో ఆడే అవకాశం కోల్పోయింది. ప్రదర్శన ఆధారిత విధానంపై తీవ్ర విమర్శలు రావడంతో.. భారత బాక్సింగ్ సమాఖ్య మళ్లీ ట్రయల్స్ విధానాన్ని తీసుకొచ్చింది. 54 కిలోల్లో నీతూ ఘంఘాస్, వరల్డ్‌కప్ పతక విజేత హితేష్ గులియా (70 కి)కు కూడా ట్రయల్స్‌లో చుక్కెదురైంది. సెమీ్‌సలో మీనాక్షి చేతిలో నీతూ ఓడగా.. సుమీత్ చేతిలో హితేష్ పరాజయం పాలయ్యాడు. మహిళల 65 కిలోల సెమీ్‌సలో అనుక్షిత బోరోపై ఆసియాడ్ పతక విజేత పర్వీన్ హుడా గెలవగా.. 80 కిలోల్లో నైనా చేతిలో పూజా రాణి ఓడింది. కాగా, సచిన్ సివాచ్ (60 కి), ప్రీతి పవార్ (54 కి), ప్రియ ఘంఘాస్ (60 కి) గత నెలలో మంగోలియాలో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్స్‌లో ఫైనల్స్ చేరడం ద్వారా కామన్వెల్త్, ఆసియాడ్‌కు అర్హత సాధించారు. వరల్డ్ చాంపియన్ జాస్మిన్ లంబోరియా (57 కి), అరుంధతి చౌదరి (70 కి) కామన్వెల్త్ బెర్త్‌లు దక్కాయి. ఈ రెండు వెయిట్ కేటగిరీలు ఆసియాడ్‌లో లేవు. కాగా, ట్రయల్స్‌లో నెగ్గిన బాక్సర్లను చెక్ రిపబ్లిక్‌లో జరిగే ప్రత్యేక క్యాంప్‌నకు పంపనున్నారు. ఇక, ద్వితీయ శ్రేణి బాక్సర్లు వచ్చే నెల 15 నుంచి జరిగే వరల్డ్ బాక్సింగ్ కప్‌లో ఆడనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
వీరేంద్ర సెహ్వాగ్‌పై మండిపడుతున్న బుమ్రా ఫ్యాన్స్
చెఫ్‌గా మారిన వైభవ్ సూర్యవంశీ.. వీడియో వైరల్