నిఖత్, లవ్లీనాకు బై
ABN , Publish Date - Mar 30 , 2026 | 01:23 AM
ఆసియా చాంపియన్‌షి్‌పలో భారత బాక్సర్లు నిఖత్ జరీన్ (51 కి), లవ్లీనా బోర్గొహైన్ (75 కి), జాస్మిన్ లంబోరియా (57 కి), అంకుషిత బోరో (65 కి)కి...
నేటి నుంచి ఆసియా బాక్సింగ్ ఛాంపియన్‌షిప్
ఉలాన్‌బాటర్ (మంగోలియా): ఆసియా ఛాంపియన్‌షిప్ లో భారత బాక్సర్లు నిఖత్ జరీన్ (51 కి), లవ్లీనా బోర్గొహైన్ (75 కి), జాస్మిన్ లంబోరియా (57 కి), అంకుషిత బోరో (65 కి)కి తొలి రౌండ్ బై లభించింది. సోమవారం ప్రారంభం కానున్న ఈ ఈవెంట్ ద్వారా కామెన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడలు, వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్స్ బెర్త్‌లను ఖరారు చేసుకొనే అవకాశాలున్నాయి. మహిళల విభాగంలో వరల్డ్ చాంపియన్ మీనాక్షి హుడా (48 కి), ప్రీతి పవార్ (54 కి)పై భారీ అంచనాలున్నాయి. పురుషుల విభాగంలో అంకుష్ (80 కి), నరేంద్ర (90+ కి)లకు తొలి రౌండ్ బై లభించింది. కాగా, 55 కిలోల విభాగంలో టాప్ సీడ్ రుయ్ యమగూచి (జపాన్)తో జాదూమణి సింగ్, 50 కిలోల్లో బెజ్కట్ ఎగెషెవ్ (కజకిస్థాన్)తో విశ్వాంత్ సురేష్, 60 కిలోల్లో బుయంద్లాయ్ బయర్కుహు (మంగోలియా)తో సచిన్ తలపడనున్నారు.
ఇవి కూడా చదవండి:
ప్రొఫెషనల్ బాక్సింగ్‌లోకి మేరీకోమ్!
ఆ ప్లేయర్లపై బీసీసీఐ కఠిన చర్యలు తీసుకోవాలి: సునీల్ గావస్కర్