నిహారికకు ఐఎం టైటిల్
ABN , Publish Date - Aug 11 , 2026 | 02:15 AM
యువ క్రీడాకారిణి నిహారిక చల్లా ఫిడే ఇంటర్నేషనల్ మాస్టర్ హోదాను దక్కించుకుంది. గత జూన్‌లో సెర్బియాలో జరిగిన బెల్‌గ్రేడ్ టోర్నీలో...
గుంటూరు సిటీ (ఆంధ్రజ్యోతి): యువ క్రీడాకారిణి నిహారిక చల్లా ఫిడే ఇంటర్నేషనల్ మాస్టర్ హోదాను దక్కించుకుంది. గత జూన్‌లో సెర్బియాలో జరిగిన బెల్‌గ్రేడ్ టోర్నీలో తొలి ఐఎం నార్మ్, జూలైలో హంగేరిలో జరిగిన పోటీల్లో రెండో నార్మ్, జూలై నెలాఖరున జరిగిన స్పెయిన్ చెస్ పోటీల్లో మూడో నార్మ్‌ను నిహారిక సొంతం చేసుకుంది. గుంటూరుకు చెందిన నిహారిక గత ఏడు నెలల్లోనూ 300లకు పైగా ఎలో రేటింగ్ పాయింట్లు సాధించింది. ప్రస్తుతం నిహారిక ఖాతాలో 2282 ఎలో రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. నిహారిక ఐఎం టైటిల్‌ను సాధించడం పట్ల రాష్ట్ర చెస్ సంఘం హర్షం వ్యక్తం చేసింది.
ఇవి కూడా చదవండి:
ఫిట్‌నెస్ కోసం 17 కిలోలు తగ్గాడు.. సర్ఫరాజ్ ఖాన్ ఈసారైనా నిరూపించుకుంటాడా?
2027 వన్డే ప్రపంచకప్.. జట్టులో చేరేందుకు సిద్ధంగా ఉన్నా: భువనేశ్వర్ కుమార్