Share News

రచిన్ రవీంద్ర రీఎంట్రీ.. భారత్‌తో వన్డే సిరీస్‌కు న్యూజిలాండ్ రెండు జట్లు..

ABN , Publish Date - Oct 11 , 2026 | 09:40 AM

భారత్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు రెండు వేర్వేరు జట్లను ప్రకటించింది. తొలి మూడు మ్యాచ్‌లకు ఒక జట్టును, చివరి రెండు మ్యాచ్‌లకు మరో జట్టును ఎంపిక చేసింది.

రచిన్ రవీంద్ర రీఎంట్రీ.. భారత్‌తో వన్డే సిరీస్‌కు న్యూజిలాండ్ రెండు జట్లు..
Rachin Ravindra

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు రెండు వేర్వేరు జట్లను ప్రకటించింది. తొలి మూడు మ్యాచ్‌లకు ఒక జట్టును, చివరి రెండు మ్యాచ్‌లకు మరో జట్టును ఎంపిక చేసింది. గాయంతో టీ20 సిరీస్‌కు ఎంపిక కాని స్టార్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర వన్డే జట్టులోకి తిరిగి వచ్చాడు. ఫిన్ అలెన్, లాకీ ఫెర్గూసన్, టిమ్ సీఫర్ట్‌లకు కూడా అవకాశం కల్పించింది (New Zealand ODI squad 2026).


నవంబర్ 4 నుంచి ప్రారంభమయ్యే ఈ సిరీస్‌కు మిచెల్ సాంట్నర్ నాయకత్వం వహించనున్నాడు. వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకొని ఆటగాళ్ల సామర్థ్యాన్ని పరీక్షించేందుకు న్యూజిలాండ్ రెండు జట్ల విధానాన్ని అనుసరిస్తోంది. రచిన్ రవీంద్ర భుజం గాయం కారణంగా భారత్‌తో జరగనున్న టీ20 మ్యాచ్‌లకు దూరమయ్యాడు (Rachin Ravindra return). అయితే వన్డే సిరీస్‌లో తొలి మూడు మ్యాచ్‌లకు ఎంపికయ్యాడు. అతడి రాకతో న్యూజిలాండ్ బ్యాటింగ్‌తో పాటు స్పిన్ బౌలింగ్ విభాగం కూడా బలోపేతం కానుంది.


తొలి మూడు వన్డేలకు న్యూజిలాండ్ జట్టు

మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైకేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, మాట్ హెన్రీ, కైల్ జేమీసన్, టామ్ లాథమ్ (వికెట్‌కీపర్), డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, నాథన్ స్మిత్, బ్లెయిర్ టిక్నర్, విల్ యంగ్.

చివరి రెండు వన్డేలకు న్యూజిలాండ్ జట్టు

మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైకేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, క్రిస్టియన్ క్లార్క్, జాకబ్ డఫీ, మాట్ ఫిషర్, లాకీ ఫెర్గూసన్, మిచ్ హే (వికెట్‌కీపర్), నిక్ కెల్లీ, టిమ్ సీఫర్ట్ (వికెట్‌కీపర్), బ్లెయిర్ టిక్నర్, విల్ యంగ్.


ఇవి కూడా చదవండి..

చెన్నైకి నేడు ప్రధాని మోదీ.. రూ.13 వేల కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శ్రీకారం..


ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Oct 11 , 2026 | 09:45 AM