Share News

లోజాన్‌ డైమండ్‌ లీగ్‌లో నీరజ్‌కు గట్టిపోటీ

ABN , Publish Date - Aug 05 , 2026 | 05:38 AM

భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా ఈనెల 21న జరిగే లోజాన్‌ డైమండ్‌ లీగ్‌లో పాల్గొనబోతున్నాడు...

లోజాన్‌ డైమండ్‌ లీగ్‌లో నీరజ్‌కు గట్టిపోటీ

న్యూఢిల్లీ: భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా ఈనెల 21న జరిగే లోజాన్‌ డైమండ్‌ లీగ్‌లో పాల్గొనబోతున్నాడు. సెప్టెంబరులో జరిగే ప్రఖ్యాత డైమండ్‌ లీగ్‌ ఫైనల్స్‌ బరిలో ఉండాలంటే నీరజ్‌కు ఈ టోర్నీ కీలకం కానుంది. ప్రస్తుతం డైమండ్‌ లీగ్‌ పట్టికలో చోప్రా ఐదు పాయింట్లతో ఏడో స్థానంలో ఉన్నాడు. ఇక లోజాన్‌ లీగ్‌లో రుమేశ్‌ తరంగ పతిరగె (శ్రీలంక), అర్షద్‌ నదీమ్‌ (పాకిస్థాన్‌), వాల్కాట్‌ (ట్రినిడాడ్‌ అండ్‌ టుబాగో), అండర్సన్‌ పీటర్స్‌ (గ్రెనెడా), వెబర్‌ (జర్మనీ)ల నుంచి నీరజ్‌కు గట్టి పోటీ ఎదురుకానుంది. ఇటీవలి కామన్వెల్త్‌ గేమ్స్‌లో నీరజ్‌కు రజతం, రుమేశ్‌కు స్వర్ణం దక్కిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి:

శ్రీలంకలో అడుగుపెట్టిన టీమిండియా.. స్టార్ ప్లేయర్ గైర్హాజరు

రహానేకు దక్కాల్సిన గుర్తింపు ఎప్పుడూ దక్కలేదు: సునీల్ గావస్కర్

Updated Date - Aug 05 , 2026 | 05:38 AM