కోచ్ వేధిస్తున్నాడు..
ABN , Publish Date - Apr 18 , 2026 | 02:28 AM
ఒలింపిక్ చాంపియన్ నీరజ్ చోప్రా సహా మరికొందరు భారత జావెలిన్ త్రో అథ్లెట్లు... కోచ్, ద్రోణాచార్య అవార్డు గ్రహీత నావల్ సింగ్‌పై...
జావెలిన్ శిక్షకుడిపై నీరజ్, సుమిత్ ఫిర్యాదు
న్యూఢిల్లీ: ఒలింపిక్ చాంపియన్ నీరజ్ చోప్రా సహా మరికొందరు భారత జావెలిన్ త్రో అథ్లెట్లు... కోచ్, ద్రోణాచార్య అవార్డు గ్రహీత నావల్ సింగ్‌పై భారత క్రీడాప్రాథికార సమాఖ్య (సాయ్)కు ఫిర్యాదు చేశారు. వ్యక్తిగతంగా తమతో పాటు కుటుంబ సభ్యులను దూషిస్తూ నావల్ మానసికంగా వేధిస్తున్నాడని సాయ్‌కు ఈనెల 10న పంపిన లేఖలో నీరజ్, పారాలింపిక్స్ విజేత, జావెలిన్ స్టార్ సుమిత్ అంటిల్ పేర్కొన్నారు. మద్యం సేవించి ఇష్టమొచ్చినట్టు తిడుతున్న నావల్‌పై కఠినచర్యలు తీసుకోవాలని ఆ లేఖలో కోరారు.
ఇవి కూడా చదవండి:
డగౌట్‌లో ఫోన్ వాడకం.. ఆర్ఆర్ టీమ్ మేనేజర్‌కు జరిమానా విధించిన బీసీసీఐ
గుజరాత్‌పై వరుణ్ చక్రవర్తి విజృంభణ చూస్తాం: కార్తిక్ త్యాగి