ఆటోలో పోల్‌వాల్టర్లు
ABN , Publish Date - May 26 , 2026 | 02:02 AM
క్రికెటర్లకు రాచమర్యాదలు జరుగుతుంటే.. మిగతా క్రీడాకారులు ఎంత చిన్నచూపునకు గురవుతున్నారో చెప్పడానికి జాతీయ రికార్డు పోల్‌వాల్టర్లే నిలువెత్తు సాక్ష్యం....
న్యూఢిల్లీ: క్రికెటర్లకు రాచమర్యాదలు జరుగుతుంటే.. మిగతా క్రీడాకారులు ఎంత చిన్నచూపునకు గురవుతున్నారో చెప్పడానికి జాతీయ రికార్డు పోల్‌వాల్టర్లే నిలువెత్తు సాక్ష్యం. రాంచీలో జరిగిన ఫెడ్‌కప్ పోల్‌వాల్ట్ ఈవెంట్‌లో మధ్యప్రదేశ్ అథ్లెట్లు దేవ్ కుమార్ మీనా, కుల్దీప్ కుమార్‌లు 5.45 మీటర్ల ఎత్తు దూకి సంయుక్తంగా జాతీయ రికార్డు సృష్టించారు. అయితే, పోటీలు ముగిశాక వీరిద్దరూ తమ క్రీడాపరికరాలైన ‘పోల్స్’ను ఆటోలో సర్దుకొని వెళ్తున్న వీడియో వైరల్‌గా మారింది. పోల్స్‌ను తరలించడానికి వీరికి తగిన సదుపాయాలు కల్పించలేకపోవడంతో ఇలా ఆటోలో వెళ్లాల్సి వచ్చింది. వీరి దుస్థితిని చూసిన నెటిజన్లు.. జాతీయ చాంపియన్లకు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి:
ఫిఫా ప్రపంచ కప్‌నకు ముందు గాయపడ్డ మెస్సి!
ఐపీఎల్ 2026: పాపం పంజాబ్.. కలగానే మిగిలిన ‘తొలి కప్పు’!