అథ్లెటిక్స్ కోచ్ రాకేశ్‌పై జీవితకాల నిషేధం
ABN , Publish Date - Sep 17 , 2026 | 01:44 AM
రోజురోజుకూ డోపీల సంఖ్య పెరుగుతుండడం దేశ క్రీడారంగాన్ని కలవర పెడుతోంది. తాజాగా...
న్యూఢిల్లీ: రోజురోజుకూ డోపీల సంఖ్య పెరుగుతుండడం దేశ క్రీడారంగాన్ని కలవర పెడుతోంది. తాజాగా మరికొందరిపై జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) వేటు వేసింది. క్రీడాకారులకు నిషేధిక ఉత్ర్పేరకాలను అందిస్తున్నాడన్న కారణంతో అథ్లెటిక్స్ కోచ్ రాకేశ్ కుమార్‌పై జీవితకాల నిషేధం విధించింది. అలాగే, నిషేధిత ఉత్ర్పేరకాలను అక్రమ రవాణా చేస్తున్నాడంటూ పవర్‌లిఫ్టర్ గౌరవ్ వత్స్‌పై తాత్కాలిక నిషేధాన్ని ప్రకటించింది. ఇక, డోప్ పరీక్షలో విఫలమవడంతో స్ర్పింటర్ ప్రకృతి రూపారావుపై తాత్కాలిక సస్పెన్షన్, వెయిట్‌లిఫ్టర్ చెల్సిపై ఐదేళ్ల నిషేధాన్ని నాడా విధించింది. వీరితో పాటు ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ కౌశల్ కుమార్, స్టీపుల్ చేజర్ జుఝార్, లాంగ్ డిస్టెన్స్ రన్నర్ బల్జీత్ కౌర్‌పైనా వేటు పడింది.
Also Read:
భారత సినీ రంగానికి అనంత్ నాగ్ సేవలు స్ఫూర్తిదాయకం: పవన్ కల్యాణ్
రుణాల మంజూరుపై బ్యాంకులు దృష్టి పెట్టాలి: సీఎం చంద్రబాబు