రికార్డుల మీరా
ABN , Publish Date - Feb 05 , 2026 | 02:56 AM
ఒలింపిక్ పతక విజేత, స్టార్ లిఫ్టర్ మీరాబాయి చాను జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో రికార్డు ప్రదర్శనతో అదరగొట్టింది. మహిళల 48 కిలోల విభాగంలో...
జాతీయ లిఫ్టింగ్‌లో స్వర్ణం కైవసం
మోదీనగర్: ఒలింపిక్ పతక విజేత, స్టార్ లిఫ్టర్ మీరాబాయి చాను జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో రికార్డు ప్రదర్శనతో అదరగొట్టింది. మహిళల 48 కిలోల విభాగంలో విజేతగా నిలిచిన మీరా.. ఈ క్రమంలో మూడు జాతీయ రికార్డులను కొల్లగొట్టింది. బుధవారం ఇక్కడ జరిగిన పోటీల్లో మీరా.. స్నాచ్‌లో 89 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 116 కిలోలతో కలిపి ఓవరాల్‌గా 205 కిలోలు లిఫ్ట్ చేసి స్వర్ణం దక్కించుకుంది. దీంతో గతంలో స్నాచ్‌లో 88 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 115 కిలోలు, ఓవరాల్‌గా 203 కిలోలతో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డులను మీరా అధిగమించింది.
ఇవి కూడా చదవండి:
ఆ విషయంలో మాత్రం టీమిండియా జాగ్రత్తగా ఉండాలి: ధోని
అసామాన్య ప్రతిభకు నిలువెత్తు రూపం.. లిజెలీ లీ