‘కామన్వెల్త్’ పతాకధారులు.. మీరా, లవ్లీనా
ABN , Publish Date - Jul 19 , 2026 | 03:26 AM
భారత వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను, బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్‌లకు అరుదైన గౌరవం దక్కనుంది...
న్యూఢిల్లీ: భారత వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను, బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్‌లకు అరుదైన గౌరవం దక్కనుంది. స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో ఈనెల 23న మొదలయ్యే కామన్వెల్త్ గేమ్స్‌లో ఈ ఇద్దరూ పతాకధారులు (ఫ్లాగ్ బేరర్స్)గా ఎంపికైనట్టు భారత ఒలింపిక్ సంఘం చీఫ్ పీటీ ఉష వెల్లడించింది. కామన్వెల్త్ క్రీడల ఆరంభ వేడుకల్లో చాను త్రివర్ణ పతాకాన్ని, లవ్లీనా కింగ్స్ బ్యాటన్‌ను చేతబూని భారత బృందాన్ని ముందుకు నడిపించనున్నారు. భారత్ నుంచి 124 మంది అథ్లెట్లు ఈ గేమ్స్‌లో పాల్గొంటున్నారు.
ఇవి కూడా చదవండి:
ఇంగ్లండ్‌తో తుది వన్డేకు భారత్ సిద్ధం.. లార్డ్స్ గడ్డపై రికార్డు మారేనా?
'రక్తానికి రక్తం'.. ట్రంప్ కుటుంబమే లక్ష్యంగా ఇరాన్ భారీ బ్యానర్లు!