హోటల్ ముందు పటాకులు, బాకాల చప్పుళ్లు.. ఇంగ్లండ్ టీమ్‌కు నిద్రాభంగం
ABN , Publish Date - Jul 05 , 2026 | 08:27 PM
ఇంగ్లండ్ ఫుట్ బాల్ జట్టుకు మెక్సికో టీమ్ అభిమానులు తాజాగా చుక్కలు చూపించారు. వారు బస చేస్తున్న హోటల్ ముందు పటాకులు పేలుస్తూ, బాకాలు ఊదుతూ నానా హంగామా సృష్టించడంతో ఇంగ్లండ్ టీమ్‌కు నిద్రాభంగం అయినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఫిఫా వరల్డ్ కప్‌లో భాగంగా జరగనున్న మెక్సికో వర్సెస్ ఇంగ్లండ్ మ్యాచ్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. రౌండ్ 16 దశలో భాగంగా సోమవారం జరగనున్న ఈ మ్యాచ్ కోసం మెక్సికో అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే ఇంగ్లండ్ జట్టు మెక్సికోకు చేరుకుంది. అయితే, మెక్సికో టీమ్ విజయాన్ని కోరుకుంటున్న అభిమానులు కొంత అత్యుత్సాహం కూడా ప్రదర్శించినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఇంగ్లండ్ టీమ్‌కు నిద్రాభంగం కలిగించేలా రాత్రి వేళ వారు బస చేసిన హోటల్ ఎదురుగా అభిమానాలు చెలరేగిపోయినట్టు కథనాలు వెలువడ్డాయి. పెద్ద ఎత్తున పటాకులు పేలుస్తూ, బాకాలు ఊదుతూ రకరకాల వాయిద్యాలను ప్లే చేస్తూ తమ టీమ్‌కు మద్దతుగా మెక్సికో అభిమానులు నానా హంగామా సృష్టించారు.
వాస్తవానికి ఈక్వెడార్‌తో మ్యాచ్‌కు ముందు కూడా మెక్సికో అభిమానులు ఇలాగే రెచ్చిపోయారు. ఈక్వెడార్ టీమ్ బస చేస్తున్న హోటల్ ఎదుట పెద్ద శబ్దాలు, నినాదాలతో నానా హంగామా చేశారు. దీంతో, అభిమానుల కంట పడకుండా చడీచప్పుడు లేకుండా హోటల్‌లోకి వెళ్లిపోదామని ఇంగ్లండ్ టీమ్ భావించింది. అయితే, అభిమానులు మారో ప్లాన్‌తో రంగంలోకి దిగి హంగామా సృష్టించారు. పటిష్ఠ భద్రత మధ్య అభిమానులు ఆ హోటల్ ముందు నానా హడావుడీ చేసిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ వార్తలనూ చదవండి:
నేను మోసపోయాను.. పృథ్వీ షాపై కాబోయే భార్య సంచలన ఆరోపణలు!
లోపాలను సరిదిద్దుకుని ప్రతి మ్యాచ్ పోరాడి గెలవాల్సిందే: మెస్సి