మెస్సీ.. మెస్సీ.. మెస్సీ అంతా తానై..
ABN , Publish Date - Jun 18 , 2026 | 05:52 AM
లియోనెల్ మెస్సీ.. తన మాయాజాలాన్ని ప్రదర్శించాడు. ఈ ప్రపంచకప్‌లో బరిలోకి దిగిన తమ ఆరంభ మ్యాచ్‌లోనే అల్జీరియాపై మూడు గోల్స్‌తో విరుచుకుపడ్డాడు. ఈ హ్యాట్రిక్‌తో టోర్నీ చరిత్రలోనే...
ఫిఫా కప్ మ్యాచ్‌లు
కొలంబియా X ఉజ్బెకిస్థాన్
(ఉదయం 7.30)
దక్షిణాఫ్రికా X చెక్ రిపబ్లిక్
(ఉదయం 9.30)
స్విట్జర్లాండ్ X బోస్నియా
(అర్ధరాత్రి 12.30)
కెనడా X కతార్
(శుక్రవారం తెల్లవారుజామున రాత్రి 3.30)
హ్యాట్రిక్ గోల్స్‌తో విజృంభణ
లియోనెల్ మెస్సీ.. తన మాయాజాలాన్ని ప్రదర్శించాడు. ఈ ప్రపంచకప్‌లో బరిలోకి దిగిన తమ ఆరంభ మ్యాచ్‌లోనే అల్జీరియాపై మూడు గోల్స్‌తో విరుచుకుపడ్డాడు. ఈ హ్యాట్రిక్‌తో టోర్నీ చరిత్రలోనే అత్యధికంగా 16 గోల్స్‌తో జర్మన్ దిగ్గజం మిరోస్లావ్ క్లోజ్ రికార్డును సమం చేశాడు. మెస్సీ మ్యాజిక్‌తో డిఫెండింగ్ చాంప్ అర్జెంటీనా ఘన బోణీ కొట్టగా.. మరో మ్యాచ్‌లో ఫ్రాన్స్ తురుపుముక్క ఎంబప్పే డబుల్ ధమాకాతో తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు.
అర్జెంటీనా అద్భుత విజయం ఫ సాకర్ వరల్డ్‌కప్
కాన్సాస్ సిటీ (యూఎస్): స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ.. వరల్డ్‌క్‌పలో తొలిసారి హ్యాట్రిక్ గోల్స్‌తో చెలరేగడంతో డిఫెండింగ్ చాంప్ అర్జెంటీనా ఘనంగా బోణీ చేసింది. గ్రూప్-జెలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా 3-0తో అల్జీరియాను చిత్తు చేసింది. రికార్డుస్థాయిలో ఆరోసారి మెగా టోర్నీ బరిలోకి దిగిన మెస్సీ (17వ, 60వ, 76వ నిమిషం) మూడు గోల్స్‌తో మురిపించడంతో.. స్టేడియంలో ఫ్యాన్స్ స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. అల్జీరియా జట్టు మెస్సీ తుఫాన్ ముందు వెలవెల బోయింది. మెగా టోర్నీ ఆరంభానికి కొద్ది రోజుల ముందు మెస్సీకి తొడకండర గాయమైంది. దీంతో అతడు పెద్దగా ప్రాక్టీస్ కూడా చేయలేదు. కానీ, బరిలోకి దిగిన తొలి మ్యాచ్‌లోనే చెలరేగి పోయాడు. 10వ నిమిషంలో లియోనెల్ గోల్ చేసినా ఆఫ్‌సైడ్ కావడంతో పరిగణించలేదు. మరోవైపు అల్జీరియా ప్లేయర్ చైబీ కూడా గోల్ సాధించినా దాన్ని కూడా ఆఫ్‌సైడ్‌గా ప్రకటించారు. అయితే, 17వ నిమిషంలో బంతిని అందుకొన్న మెస్సీ.. డి-బాక్స్ బయట నుంచి కొట్టిన బలమైన కిక్ నేరుగా ప్రత్యర్థి గోల్ కీపర్ లూకా జిదానె చేతులను తాకుతూ వెళ్లి గోల్‌లో పడడంతో.. అర్జెంటీనా 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇక, ద్వితీయార్థంలో అల్జీరియా దూకుడు పెంచినా.. అర్జెంటీనా ముందు వారి ఎత్తులు పారలేదు. ఈ క్రమంలో 66వ నిమిషంలో అర్జెంటీనా మిడ్‌ఫీల్డర్ అలెక్సిక్ కొట్టిన లాంగ్ కిక్‌ను అల్జీరియా కీపర్ అందుకోలేక పోయాడు. అతడికి తగిలి బంతి వెనక్కిరాగా.. మెస్సీ లాఘవంగా బంతిని నెట్‌లోకి పంపాడు. 76వ నిమిషంలో మరో లాంగ్ షాట్‌తో మెస్సీ గోల్ చేసి హ్యాట్రిక్ సాధించాడు. ఇదే గ్రూప్‌లో జరిగిన మరో మ్యాచ్‌లో ఆస్ట్రియా 3-1తో జోర్డాన్‌పై గెలిచింది.
ఎంబప్పే డబుల్ ధమాకా
స్ట్రయికర్ కిలియన్ ఎంబప్పే డబుల్ ధమాకాతో.. గత టోర్నీ ఫైనలిస్ట్ ఫ్రాన్స్ అదరగొట్టింది. గ్రూప్-ఐలో జరిగిన మ్యాచ్‌లో ఫ్రాన్స్ 3-1తో సెనెగల్‌పై గెలిచింది. ఎంబప్పే (68వ, 90+6వ నిమిషం), బ్రాడ్లీ బార్కోలా (82వ) గోల్స్ చేశారు. సెనెగల్ తరఫున ఇబ్రహీం ఎంబయే (90+5వ) ఏకైక గోల్ సాధించాడు. ఫస్టా్‌ఫలో ఇరు జట్లూ గోల్ సాధించడంలో విఫలమయ్యాయి. సెకండాఫ్ ఆరంభమైన 20 నిమిషాల వరకు కూడా పరిస్థితిలో ఎటువంటి మార్పూ రాలేదు. కానీ, 68వ నిమిషంలో ప్రత్యర్థి పెనాల్టీ ఏరియాలో బంతిని అందుకొన్న కిలియన్.. ఎటువంటి తప్పిదం చేయకుండా నేరుగా గోల్ చేశాడు. ఆ తర్వాత సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన బ్రాడ్లీ 82వ నిమిషంలో గోల్ చేయడంతో ఫ్రాన్స్ 2-0తో మెరుగైన స్థితిలో నిలిచింది. ఇంజ్యూరీ టైమ్‌లో సెనెగల్ ప్లేయర్ ఇబ్రహీం.. ఫ్రాన్స్ డిఫెన్స్‌ను బోల్తా కొట్టిస్తూ గోల్ సాధించాడు. ఆ వెంటనే ఎంబప్పే దూరం నుంచి కొట్టిన కిక్ నేరుగా నెట్‌లో పడింది.
సత్తాచాటిన ఎర్లిన్ హాలాండ్
ఫాక్స్‌బరో (యూఎస్): వరల్డ్‌కప్ అరంగేట్రంలోనే నార్వే స్టార్ స్ట్రయికర్ ఎర్లిన్ హాలాండ్ డబుల్ గోల్స్‌తో మెరిశాడు. దీంతో గ్రూప్-ఐలో జరిగిన మ్యాచ్‌లో నార్వే 4-1తో ఇరాన్‌ను మట్టికరిపించింది. నార్వే తరఫున హాలాండ్ (29వ, 43వ), లియో ఆస్టిగార్డ్ (76వ) గోల్స్ చేశారు. కాగా, 39వ నిమిషంలో ఇరాక్‌కు గోల్ అందించిన అయమిన్ హోస్సేన్.. సెకండాఫ్ స్టాపేజ్ టైమ్‌లో సెల్ఫ్ గోల్ చేశాడు.
మెస్సీ ఫౌల్ చేశాడా?
అల్జీరియాతో మ్యాచ్‌లో మెస్సీ చేసిన ఓ చర్య వివాదానికి దారితీసింది. మ్యాచ్‌లో తొలి గోల్ కొట్టిన కొన్ని నిమిషాల తర్వాత మెస్సీ తన ప్రత్యర్థి జట్టు డిఫెండర్ ఐసా మాండిని అడ్డుకునే క్రమంలో తన కాలి మడమతో అతడి కాలి వెనుకభాగంలో తొక్కాడు. దీంతో తీవ్రమైన నొప్పితో మాండి నేలపై పడిపోయాడు. ఇది రీప్లేలో కూడా స్పష్టంగా కనిపించింది. నిబంధనలకు విరుద్ధంగా మెస్సీ ఇలా ఫౌల్ చేసినా మ్యాచ్ రెఫరీ అతడికి రెడ్ లేదా ఎల్లో కార్డ్ చూపించలేదు. ఇది సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. మెస్సీ అయితే, ఫౌల్ చేసినా చర్యలుండవా అంటూ సోషల్ మీడియాలో కొందరు సాకర్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
గోల్ కొట్టాడు.. ఏడ్చాడు..
సాధారణంగా మ్యాచ్ గెలిచినప్పుడో, ఓడినప్పుడో ఆటగాళ్లు కంటతడి పెట్టడం చూస్తాం. కానీ అల్జీరియాతో మ్యాచ్‌లో తొలి గోల్ చేసిన వెంటనే మెస్సీ భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకోవడం కెమెరా కంటికి చిక్కింది. ఈ దృశ్యం చూసి సాకర్ ప్రపంచమంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. అయితే, తాను ఎందుకు ఏడ్చానన్నది మ్యాచ్ ముగిశాక మెస్సీ చెప్పాడు. ‘నా భావోద్వేగానికి ఫుట్‌బాల్‌కు సంబంధం లేదు. అది వ్యక్తిగతం. ఇటీవల నేను క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నా. ఆ మానసిక ఒత్తిడి వల్లే మైదానంలో కన్నీళ్లు వచ్చాయి. మ్యాచ్‌లో జట్టు సహచరులు ఎంతో అండగా నిలిచారు. సరైన సమయంలో పాస్‌లు అందించి గోల్స్ సాధించేందుకు సహకరించారు. ఇది నా ఒక్కడి గెలుపు కాదు. సమష్టి విజయం’ అని మెస్సీ చెప్పుకొచ్చాడు. అయితే, తాను ఎదుర్కొన్న కఠిన పరిస్థితులేంటన్నది మాత్రం మెస్సీ వెల్లడించలేదు. టోర్నీకి ముందు గాయంతో బాధపడుతూ, తీవ్రమైన ఫిట్‌నెస్ సమస్యలతో సతమతమైన మెస్సీ.. మ్యాచ్‌తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చినందుకు భావోద్వేగానికి గురై ఉండొచ్చని సాకర్ పండితులు విశ్లేషిస్తున్నారు.
150 మీటర్లు.. 14.67 సెకన్లు
నోవా లైల్స్ ప్రపంచ రికార్డు
ఒస్ట్రావా (చెక్ రిపబ్లిక్): రెండేళ్ల క్రితం పారిస్ ఒలింపిక్స్‌లో వంద మీటర్ల చాంపియన్‌గా నిలిచి రికార్డుకెక్కిన అమెరికా చిరుత నోవా లైల్స్.. ఇప్పుడు 150 మీటర్ల రేసులోనూ సత్తా చాటుతూ ప్రపంచ అత్యుత్తమ టైమింగ్‌ను నమోదుచేశాడు. ఇక్కడ జరిగిన గోల్డెన్ స్పైక్ మీట్‌లో 150 మీటర్ల రేసును నోల్స్ కేవలం 14.67 సెకన్లలోనే ముగించి చరిత్ర సృష్టించాడు. దీంతో ఈ ఏప్రిల్‌లో ఫ్లోరిడాలో జమైకా అథ్లెట్ కిషానె థాంప్సన్ నెలకొల్పిన 14.72 సెకన్ల రికార్డు బద్దలైంది. ప్రపంచ రికార్డు టైమింగ్‌తో నోల్స్‌కు స్వర్ణం దక్కగా.. 14.78 సెకన్లతో సినెసిఫో డాంబిలె (దక్షిణాఫ్రికా)కు రజతం, ఆస్ట్రేలియా టీనేజ్ సంచలనం గౌట్ గౌట్ (14.96 సె)కు కాంస్యం లభించాయి.
హ్యాట్రిక్ గోల్స్ చేసిన మెస్సీ.. వరల్డ్‌క్‌పలో అత్యధికంగా 16 గోల్స్‌తో జర్మన్ మాజీ ప్లేయర్ మిరోస్లావ్ క్లోజ్ రికార్డును సమం చేశాడు.
ఇవీ చదవండి:
సైబర్ నేరస్థులు 'పరాన్నజీవులు'.. సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
ఐఎస్ఐ సంబంధిత ఉగ్ర ముఠా గుట్టురట్టు.. ఏడుగురి అరెస్ట్