94వ గ్రాండ్‌మాస్టర్.. మయాంక్
ABN , Publish Date - Mar 15 , 2026 | 06:13 AM
వర్ధమాన చెస్ ఆటగాడు, అసోం రాజధాని గువాహటికి చెందిన 17 ఏళ్ల మయాంక్ చక్రవర్తి భారత 94వ గ్రాండ్ మాస్టర్ (జీఎం)గా నిలిచాడు. స్వీడన్‌లో జరిగిన ఫస్ట్ హోటల్స్ టాలెంట్ యంగ్ టాలెంట్స్...
‘ఈశాన్యం’ నుంచి తొలి జీఎంగా రికార్డు
ముంబై: వర్ధమాన చెస్ ఆటగాడు, అసోం రాజధాని గువాహటికి చెందిన 17 ఏళ్ల మయాంక్ చక్రవర్తి భారత 94వ గ్రాండ్ మాస్టర్ (జీఎం)గా నిలిచాడు. స్వీడన్‌లో జరిగిన ఫస్ట్ హోటల్స్ టాలెంట్ యంగ్ టాలెంట్స్ చెస్ టోర్నమెంట్ ఎనిమిదో రౌండ్లో స్వీడన్ ఇంటర్నేషనల్ మాస్టర్ (ఐఎం) ఫిలిప్ లింగ్డెన్‌పై నెగ్గడం ద్వారా మయాంక్ జీఎం హోదాకు అవసరమైన మూడో నార్మ్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో 2500 ఎలో రేటింగ్ మార్క్‌ను కూడా దాటాడు. అనంతరం చివరిదైన తొమ్మిదో రౌండ్లో ఇంగ్లండ్ ఆటగాడు జాన్ బి విల్లోతో గేమ్‌ను డ్రా చేసుకున్న మయాంక్ (7 పాయింట్లు) అగ్రస్థానంతో టోర్నీ చాంపియన్‌గా నిలిచాడు. జాన్ బి విల్లోకు రెండోస్థానం, నార్వేకు చెందిన అక్సెల్ బు వాలోయ్‌కు మూడోస్థానం దక్కాయి. ఈ ప్రదర్శనతో మయాంక్.. ఈశాన్య (నార్త్ ఈస్ట్) ప్రాంతం నుంచి గ్రాండ్‌మాస్టర్ హోదా సాధించిన తొలి ఆటగాడిగా రికార్డుకెక్కాడు. రెండేళ్ల క్రితం ఐఎం హోదా అందుకున్న మయాంక్.. ఆసియా యూత్ చాంపియన్‌షిప్ అండర్-10 విభాగంలో రజతం సాధించాడు.
ఇవి కూడా చదవండి...
గ్యాస్ సరఫరాపై సీఎం చంద్రబాబు ఫోకస్.. మంత్రులతో చర్చ
కేంద్రమంత్రి అన్నపూర్ణా దేవితో మంత్రి సీతక్క భేటీ.. చర్చించిన అంశాలివే